Brawl Over DJ: డీజే విషయంలో గొడవ.. పెళ్లి బృందంపై హోటల్ సిబ్బంది దాడి.. వీడియో వైరల్
ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం. శనివారం సాయంత్రం అక్కడి హోటల్‌లో మెహిందీ వేడుక నిర్వహించారు.
- Narender Thiru
- Published On : February 27, 2023 / 02:39 PM IST
Brawl Over DJ: సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలు కొన్ని సార్లు ఘర్షణలకు కారణమవుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుక గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన అతిథులు, అక్కడి హోటల్ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ప్రధానంగా పెళ్లికి వచ్చిన అతిథులపై హోటల్ సిబ్బంది దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం. శనివారం సాయంత్రం అక్కడి హోటల్‌లో మెహిందీ వేడుక నిర్వహించారు. అయితే, హోటల్‌లో డీజేను అర్ధరాత్రి 02.00 గంటలకు ఆపేశారు. దీనిపై పెళ్లికి వచ్చిన అతిథులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతసేపు డీజే పెట్టమని చెప్పారు. దీనికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి, అతిథులకు మధ్య గొడవ తలెత్తింది.
Dangerous Man: ముంబైలో అడుగుపెట్టిన ‘కిరాతకుడు’.. అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక
ఈ గొడవ పెద్దదైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముఖ్యంగా హోటల్ సిబ్బంది, బౌన్సర్లు కలిపి వరుడితోపాటు, అతడి బంధువులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరి కొందరు పరారీలో ఉండటంతో వారి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023
