Ayyanna Patrudu: సుప్రీం కోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకు ఎదురుదెబ్బ.. ఫోర్జరీ కేసు విచారణకు అనుమతి

గతంలో అయ్యన్నపై దాఖలైన ఫోర్జరీ కేసును సెక్షన్ ఐపీసీ 467 కింద విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెక్షన్‌ 41సిఆర్‌పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Ayyanna Patrudu: సుప్రీం కోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకు ఎదురుదెబ్బ.. ఫోర్జరీ కేసు విచారణకు అనుమతి

Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయ్యన్న పాత్రుడుపై దాఖలైన ఫోర్జరీ కేసు విచారణకు కోర్టు అనుమతించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవి కుమార్ ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

Medico Preeti : ప్రీతిది ముమ్మాటికీ మర్డరే.. తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

గతంలో అయ్యన్నపై దాఖలైన ఫోర్జరీ కేసును సెక్షన్ ఐపీసీ 467 కింద విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెక్షన్‌ 41సిఆర్‌పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి పారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి, తప్పుడు ధృవ పత్రాలు సమర్పించి, అక్రమ నిర్మాణాలు చేపట్టిన అంశంలో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌పై కొంతకాలం క్రితం ఫోర్జరీ కేసు నమోదైంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాలువను ఆక్రమించుకుని అయ్యన్న పాత్రుడు అక్రమ ఇంటి నిర్మాణం చేపట్టాడు.

Actress Kathuri : మరోసారి ఆంటీ వివాదం.. అనసూయని ఆంటీ అంటారా? సీనియర్ హీరోలని అంకుల్ అనగలరా?.. నటి కస్తూరి వ్యాఖ్యలు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. అయితే, ఈ నిర్మాణం సక్రమమే అని నమ్మించేందుకు ఆయన ప్రయత్నించారు. దీని కోసం ఫోర్జరీ ఎన్ఓసీ సృష్టించారు. కానీ, ఆ సర్టిఫికెట్‌లో ఉన్నది తన సంతకం కాదని సంబంధిత అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే విచారణ జరిపేందుకు తాజాగా సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ అంశంలో ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.