Actress Kathuri : మరోసారి ఆంటీ వివాదం.. అనసూయని ఆంటీ అంటారా? సీనియర్ హీరోలని అంకుల్ అనగలరా?.. నటి కస్తూరి వ్యాఖ్యలు..

తాజాగా నటి కస్తూరి మరోసారి ఈ ఆంటీ వివాదంపై మాట్లాడింది. భారతీయుడు, అన్నమయ్య లాంటి పలు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ రాగా కస్తూరి సీరియస్ అయింది..............

Actress Kathuri : మరోసారి ఆంటీ వివాదం.. అనసూయని ఆంటీ అంటారా? సీనియర్ హీరోలని అంకుల్ అనగలరా?.. నటి కస్తూరి వ్యాఖ్యలు..

Actress Kathuri serious comments on Anasuya Aunty Issue

Actress Kathuri :  కొన్ని రోజుల క్రితం అనసూయ ఆంటీ వివాదం ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో కొందరు అనసూయని ఆంటీ అన్నారని పోలీసు కేసు పెడతానంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది అనసూయ. దీంతో కొన్ని రోజులు ఆంటీ అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండేలా చేశారు నెటిజన్లు. కొంతమంది మీద ఆంటీ అంటున్నారని సైబర్ కంట్రోల్ లో కూడా కంప్లైంట్ చేసింది అనసూయ. కొన్ని రోజులు ఈ ఆంటీ వివాదం హడావిడి అయి ఆ తర్వాత సద్దుమణిగింది. అయినా ఇప్పటికి కూడా పలువురు సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అని సంబోధిస్తూ ఉంటారు.

తాజాగా నటి కస్తూరి మరోసారి ఈ ఆంటీ వివాదంపై మాట్లాడింది. భారతీయుడు, అన్నమయ్య లాంటి పలు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ రాగా కస్తూరి సీరియస్ అయింది.

Armaan Malik : యూట్యూబర్ పై ఫైర్ అయిన బుట్టబొమ్మ సింగర్..

కస్తూరి మాట్లాడుతూ.. మా ఏజ్ వాళ్ళని ఒక చిన్నపాప లేదా బాబు వచ్చి ఆంటీ అని పిలిస్తే ఓకే కాని దున్నపోతులా ఉన్న ఓ వ్యక్తి వచ్చి మమ్మల్ని ఆంటీ అని పిలిస్తే ఎలా? పెద్దవాళ్ళు అయిపోతే మహిళలను ఆంటీ అని పిలవడం కరెక్ట్ కాదు. అనసూయని ఆంటీ అంటున్నారు. అనసూయ కంటే ఎక్కువ వయసున్న సీనియర్ హీరోలని అంకుల్ అని అనగలరా? ఆ దమ్ము ఉందా? ఆల్రెడీ కొంతమంది ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ ని తీసుకొచ్చారు. మీకు గౌరవం లేకపోతేనే, చెడు ఆలోచనలు ఉంటేనే ఆంటీ అని పిలుస్తారు. ఈ విషయంలో నేను అనసూయకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పింది. మరి కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎవరైనా నెటిజన్లు స్పందించి మళ్ళీ ఆంటీ అంటూ పోస్టులు చేస్తారేమో చూడాలి.