Medico Preeti : ప్రీతిది ముమ్మాటికీ మర్డరే.. తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు.

Medico Preeti : ప్రీతిది ముమ్మాటికీ మర్డరే.. తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

NARENDRA

Medico Preeti : మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లేదాకా చూశాడని.. ఆ తర్వాతే పడిపోయినట్లు నడించాడని ప్రీతి తండ్రి నరేంద్ర ఆరోపించారు. మర్డర్ ప్లాన్ కు ముందే సైఫ్ పక్కా స్కెచ్ వేశాడని అన్నారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించాడని ఆరోపించారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలన్నారు.

నిన్న(ఆదివారం) రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. సీనియర్లు వేధిస్తున్నారంటూ కేఎంసీంలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 5 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రీతి కన్నుమూసింది. గాంధీ మార్చురీలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. హైదరాబాద్ నుంచి ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గర్నిగడ్డ తండాకు మృతదేహాన్ని తరలించారు. అంతకముందు ప్రీతి తల్లితండ్రులు నిమ్స్ లో ప్రీతి మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు.

Minister Harish Rao : మెడికో ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశాం : మంత్రి హరీశ్ రావు

పోస్టుమార్టం కోసం తరలించడాన్ని అడ్డుకున్నారు. తమ కూతురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్ వోడీ, ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ కూతురు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను తెలపాలని డిమాండ్ చేశారు. ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నెల 22 తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అసలు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు.

సీనియర్ విద్యార్థినిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతదేహాన్ని ఎంతకూ పోస్టుమార్టానికి తరలించేందుకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం తరపున పోలీసులు చర్చలు జరిపారు. మంత్రులతో ఫోన్ లో మాట్లాడించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రులు అంగీకరించారు. అంతేకాకుండా ప్రీతి మృతిపై విచారణ జరిపించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Medico Preeti : మెడికో ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెచ్ వోడీ, ప్రిన్సిపల్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. మంత్రి హరీశ్ రావు సైతం హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రీతి బంధువులను గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి పోస్టుమార్టం పూర్తి అవ్వడంతో ప్రీతి మృతదేహాన్ని గిర్నితండాకు తరలించారు.