ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్ల కుటుంబాలకు భద్రత లేకుండా పోతుంది. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి అమరులైయ్యారనే.. ఏ మాత్రం దేశభక్తి చూపించకుండా దోచుకుంటున్నారు దుండగులు. ప్రాణాలను అర్పించిన కుటుంబాలకు నష్ట పరిహారాన్ని కూడా అందనీయకుండా చేస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి మధ్య ప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాకు చెందిన షాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్.. ఓం ప్రకాశ్ మార్దానియా 2013 శ్రీనగర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో అమరులైయ్యారు. ఆ దాడిలో భారత సైన్యం ఓం ప్రకాశ్‌తో పాటు మరో నలుగురు జవాన్లను కోల్పోయింది. ప్రకాశ్‌కు భార్య కోమల్ బాయి, 7, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ. 8 లక్షల నష్ట పరిహారం పంపింది.
ఆ సొమ్ముపై కన్నేసిన దుండగుడు గత సోమవారం (ఫిబ్రవరి 11) ఆర్మీకి చెందిన వ్యక్తి(మిశ్రీలాల్ మీనా) అని నమ్మబలికాడు. ఇంతే సొమ్ము కాదు, ఇంకా మరో రూ. 34 లక్షలను పరిహారం కింద మంజూరు చేసిందని మాయమాటలు చెప్పాడు. అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే అంతకుముందు ఇచ్చిన రూ. 8 లక్షలను బ్యాంకు నుంచి విత్‌డ్రా చేయాలని ఆమెను నమ్మించాడు. కేసు విచారణలో లోకల్ పోలీసులతో పాటు.. సీఆర్‌పీఎఫ్ కూడా తమకు సహకరిస్తోందని సెహోర్ అదనపు ఎస్‌పీ సమీర్ యాదవ్ వెల్లడించారు.
Read Also : Pulwama effect: పాక్ క్రికెట్ మ్యాచ్‌లు మేం ప్రసారం చేయం
Read Also : పుల్వామా ఉగ్రదాడి : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత