ఖల్నాయక్ పాటకు బాడీబిల్డర్ పోలీస్ డాన్స్.. ఆడేసుకుంటున్న నెటిజనులు
కండలు తిరిగిన బాడీతో క్రీజ్ సంపాదించిన తీహార్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ.. ఖల్నాయక్ సినిమాలోని పాటకు డాన్స్ చేసి..
- Naga Srinivasa Rao Poduri
- Updated on- August 9, 2024 / 04:33 PM IST
Delhi Bodybuilder Cop Deepak Sharma Waves Pistol While Dancing At Party
Delhi Bodybuilder Cop Deepak Sharma: ఢిల్లీలోని తీహార్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఖాకీ డ్రెస్సుతో కండలు తిరిగిన బాడీతో మనోడు చాలా ఫేమస్. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి 4.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిట్నెస్తో కంటే కాంట్రవర్సీలతో ఆయన తరచూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు.
బర్డే పార్టీలో ఫ్రెండ్స్‌తో కలిసి.. ఖల్నాయక్ సినిమాలోని “ఖల్ నాయక్ హూన్ మైన్”కి పాటకు దీపక్ శర్మ హుషారుగా డాన్స్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీపక్ శర్మ డాన్స్‌పై ఎవరికి అభ్యంతరం లేదు కానీ, ఆయన తుపాకీ పట్టుకుని గురిపెడుతున్నట్టుగా గంతులు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని ఘోండా ప్రాంతంలో జరిగిన పుట్టినరోజు పార్టీలో తుపాకీతో డాన్స్ చేయడమే కాకుండా, గాల్లోకి కాల్పులు కూడా జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అయితే కాల్పులు జరిపినట్టు పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హస్తినవాసులు ఫైర్ అవుతున్నారు. ఉన్నతస్థానంలో ఉన్న పోలీసు అధికారి ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం సబబేనా? ఇయన ప్రవర్తనను ఢిల్లీ పోలీసులు అంగీకరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదకరంగా తుపాకీ పట్టుకుని తాగుబోతు పాటలకు డ్యాన్స్ చేయడం ఏమిటని నిలదీశారు. సొంత క్రేజ్ పెంచుకోవడానికి పోలీసు వ్యవస్థను దీపక్ శర్మ దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడుతున్నారు. యూనిఫాంలో ఉన్నవారి నుంచి మనం ఆశించే ప్రవర్తన ఇదేనా అంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించారు.
Also Read : నువ్వే నమ్మకుంటే ఇంకెవరు నమ్ముతారు.. కంటితడి పెట్టిస్తున్న బీటెక్ విద్యార్థిని చివరి లెటర్
అయితే దీపక్ శర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. దేశంలో సంచలనం రేపిన రూ. 200 కోట్ల మోసం కేసులో ప్రధాన సూత్రధారి సుకేష్ చంద్రశేఖర్ బ్యారక్‌పై దాడి చేయడం ద్వారా విస్తృత ప్రచారం పొందాడు. ఓ మహిళను 50 లక్షలకు మోసం చేసి గతేడాది వార్తల్లో నిలిచాడు. ఇక అతడి బాడీ బిల్డింగ్‌కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.
