నాన్నా.. నువ్వే నా ధైర్యం.. నీ పరువు తీసే పని చేయను.. కంటితడి పెట్టిస్తున్న బీటెక్ స్టూడెంట్ చివరి లెటర్

నీ పరువు తీసే పని చేయను.. ఒకవేళ తప్పు చేస్తే ఆరోజే నా చివరి రోజు.. అంటూ బీటెక్ విద్యార్థిని తన తండ్రికి రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది.

నాన్నా.. నువ్వే నా ధైర్యం.. నీ పరువు తీసే పని చేయను.. కంటితడి పెట్టిస్తున్న బీటెక్ స్టూడెంట్ చివరి లెటర్

macherla btech student heartbreaking last letter to her father

Updated On : August 6, 2024 / 1:39 PM IST

macherla btech student : అనుమానం.. బీటెక్ విద్యార్థిని ప్రాణం తీసింది. తండ్రి తనను అపార్థం చేసుకున్నాడన్న బాధతో ఓ యువతి తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తండ్రిని ఉద్దేశించి ఆమె రాసిన చివరి లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన రేణుక ఎల్లమ్మ(22) మాచర్లలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. మాచర్లలోనే హాస్టల్ ఉంటూ కాలేజీకి వెళుతోంది. తనను సోదరిలా భావించే క్లాస్‌మేట్‌ ఫోన్ చేయడంతో ఆమె స్పందించలేదు. దీంతో అతడు.. రేణుక తండ్రి గౌరప్పకి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

కంగారుపడిన గౌరప్ప కూతురికి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ తీయడంతో గట్టిగా మందలించాడు. అబ్బాయిలతో స్నేహమేంటి? అతడెందుకు తనకు ఫోన్ చేశాడని కోప్పడ్డాడు. తండ్రిని కన్విన్స్ చేయడానికి రేణుక ప్రయత్నించినా అతడి కోపం తగ్గలేదు. తెల్లారేసరికి కాలేజీకి వచ్చి మాట్లాతానని చెప్పి గౌరప్ప ఫోన్ పెట్టేశాడు. తండ్రి మాటలకు రేణుక బాగా భయపడిపోయింది. తాను ఎంతో ప్రేమించే నాన్నే తన మాటలు నమ్మకపోవడంతో చాలా బాధపడింది. “నేను ఏ తప్పు చేయలేదు నాన్నా. నువ్వే నమ్మకుంటే ఇంకెవరు నమ్ముతారు’ అంటూ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది.

రేణుక తల్లిదండ్రులు ఉదయం హాస్టల్ కు వచ్చి చూడగా ఆమె కనబడలేదు. ఆమె స్నేహితులు వెతుకుతుండగా హాస్టల్ లో ఖాళీగా ఉన్న రూములో ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుని వేలాడుతున్న రేణుక కనిపించింది. భయకంపితులైన రేణుక ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న మాచర్ల పట్టణ సీఐ బ్రహ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని, రేణుక రాసిన లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గౌరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read : మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..

రేణుక ఉదంతంపై నెటిజనులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తండ్రి అంటే అంత గౌరవం ఉన్న కూతుళ్లు ఈ కాలంలో చాలా అరుదు. నాన్న అంటే ఎంత అభిమానం, గౌరవం ఉంది తనకి. అదే ధైర్యంగా చేసుకొని నాన్నతో మాట్లాడాల్సింది, ఆత్మహత్య కాకుండా అని ఒక నెటిజన్ అన్నారు.

Also Read : మమ్మీ, పప్పా సారీ.. నన్ను క్షమించండంటూ చివరి లేఖ రాసి.. ఎందుకిలా చేసింది?

పేరెంట్స్ కొంచెం ఇలాంటి విషయాల్లో విజ్ఞానంగా ఉండాలి. అలాగే వాళ్ళు తప్పుగా అనుకున్నారని వెంటనే ఇలాంటి ఘోర నిర్ణయాలు తీసుకోకూడదు. కొద్దిగా ఓపిక పడితే కాలమే నిజాన్ని తేలుస్తుందని మరొకరు కామెంట్ చేశారు.

ఎదురుగా చెప్పే ధైర్యం లేకుంటే, ఇదే లెటర్ తన నాన్న జేబులో పెట్టి ఉంటే అర్ధం చేసుకునే వాడు కదా. చావు ఒక్కటే మార్గం అయితే ఎలా. Time is the best medicine for healing. సమయం గడిచే కొద్దీ తండ్రి అర్థం చేసుకునే వారని ఇంకొరు అభిప్రాయపడ్డారు.