Delhi Crime : పసిబిడ్డను మైక్రోఓవెన్‌లో పెట్టి చంపిన తల్లి..!!

రె

Mother Killed Daughter

Mother Killed Daughter: బిడ్డ ఏడిస్తే చాలు కన్నతల్లి గుండె అల్లాడిపోతుంది. బిడ్డకు చిన్నపాటి దెబ్బ తగిలితే అమ్మ హృదయం తల్లడిల్లిపోతుంది. అటువంటి ఓ అమ్మ మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసి తల్లా? కసాయా?అనిపించేలా చేసింది. రెండు నెలల పసిగుడ్డును అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపి ఆ తరువాత మృతదేహాన్ని మైక్రో ఓవెన్ లో పెట్టి కాల్చింది. ఈ అత్యంత దారుణం ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (మార్చి 21,2022)చోటుచేసుకుంది. ఢిల్లీలోని మాలవీయ నగర్​లో రెండు నెలల కన్నకూతుర్ని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​లో పెట్టింది.

మాలవీయ నగర్​లోని చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంప‌తుల‌కు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని డింపుల్ బిడ్డ గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంట గదిలోని మైక్రోఓవెన్‌లో (microwave) పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది. అంతలోనే పెద్దావిడ అరుపులు విన్నఇరుగుపొరుగు వారు వెంటనే వచ్చారు. కానీ అప్పటికే తలుపులు వేసేసింది డింపుల్.

దీంతో వారు వంట గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలకు వెళ్లి మైక్రోఓవెన్ తీసి చూడగా పాప చ‌నిపోయి కనిపించింది. దీంతో ఈ ఘటనపై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.