Batla House Encounter: ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‭ను హత్య చేసిన ఆరిజ్ ఖాన్‭కు మరణ శిక్ష తప్పింది. కోర్టు తీర్పు ఏంటంటే?

బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది అరిజ్ ఖాన్‌కు మరణశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీకి చెందిన కిందిస్థాయి కోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు వెలువరించింది.

Batla House Encounter: బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మను హత్య చేసిన నిందితుడు అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్ష తప్పింది. దిగువ కోర్టు 2021 మార్చిలో అతడి మరణశిక్ష విధించింది. అయితే తాజాగా దానిని ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కింది కోర్టు తీర్పును కోర్టు సమర్థించింది. సాకేత్ కోర్టు మార్చి 8, 2021న అరిజ్ ఖాన్ (టెర్రరిస్ట్ అరిజ్ ఖాన్)ని దోషిగా నిర్ధారించి, మార్చి 15, 2021న అతనికి మరణశిక్ష విధించింది. మరణశిక్షను నిర్ధారించడానికి దిగువ కోర్టు నుంచి హైకోర్టు సూచనను స్వీకరించింది.

ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కొన్ని రోజుల తర్వాత, బాట్లా హౌస్‌లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. 19 సెప్టెంబర్ 2008న జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇన్‌స్పెక్టర్ శర్మ వీరమరణం పొందాడు. ఆగస్టు 18న ఢిల్లీ పోలీసులు, నిందితుల వాదనలు విన్న తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. తన క్లయింట్ అరిజ్ ఖాన్‌ను సంస్కరించడం సాధ్యం కాదని ఎలా చెప్తామని అరిజ్ ఖాన్ తరపు న్యాయవాది వాదించారు. సంస్కరణకు అవకాశం లేకుంటే జీవిత ఖైదు అనే నియమం ఉందని సూచించారు.

వాదనలు విన్న అనంతరం.. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ మహాజన్ మాట్లాడుతూ, యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని హత్య చేయడం మరణశిక్షను సమర్థించే అరుదైన కేసులలో ఒకటని అన్నారు. ఖాన్ కు సంబంధించి సామాజిక పరిశోధన నివేదిక, మానసిక విశ్లేషణ నివేదికను కోర్టు ముందు సమర్పించారు. అయితే జైలులో అతని ప్రవర్తన సంతృప్తికరంగా లేదని జడ్జి అన్నారు.