Gang Rape : 16 ఏళ్ల బాలికపై కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్
ఢిల్లీలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
- chvmurthy
- Published On : July 15, 2022 / 08:50 PM IST
Delhi Gang Rape
Gang Rape : ఢిల్లీలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరితో పాటు కారులోనే ఉన్న మరోక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
జులై6వ తేదీ సాయంత్రం మోతీ బాగ్ ప్రాంతంలో ఫ్రెండ్‌ను కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా తన ఇంటివద్ద ఉండే పరిచయస్తులైన ఇద్దరు వ్యక్తులు కలిశారని బాధితురాలు తెలిపింది. ఆపై వారు మరో వ్యక్తికి ఫోన్ చేయగా అతడు కారులో వచ్చాడని… ఆ కారులో తనను దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి మహిపల్పూర్ మార్కెట్‌కు తీసుకువెళ్లారని బాధితురాలు తెలిపింది.
అప్పుడు సమయం రాత్రి గం. 8-30 దాటిందని అక్కడ వారు మద్యం సేవించి తనతో బలవంతంగా మద్యం తాగించారని ఆమె తెలిపింది. అక్కడి నుంచి బయలుదేరి నిర్మానుష్య ప్రదేశం వైపు వెళ్తుండగా కదులుతున్న కారులోనే తనపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారని… తాను ప్రతిఘటించటంతో తీవ్రంగా కొట్టారని తెలిపింది.
లైంగిక దాడి ఘటనను వారు వీడియో తీశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వివరించింది. జులై 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢిల్లీలోని ఎస్‌జే హాస్పటల్ నుంచి పోలీసు స్టేషన్ కు ఫోన్ రావటంతో ఆస్పత్రికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలిక ఇచ్చిన వాంగూల్మంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ?… 40 మందికి అస్వస్ధత
