సినీనటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు

హైదరాబాద్ లో డీజీజీఐ దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లో సినీనటి లావణ్య త్రిపాఠి ఇంటిపై దాడులు చేసింది.

  • Publish Date - December 20, 2019 / 01:59 PM IST

హైదరాబాద్ లో డీజీజీఐ దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లో సినీనటి లావణ్య త్రిపాఠి ఇంటిపై దాడులు చేసింది.

హైదరాబాద్ లో డీజీజీఐ దాడులు నిర్వహించింది. నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లో సినీనటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు చేసింది. చిట్ ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టేరేజ్ యూనిట్లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కన్ స్ట్రక్షన్ కంపెనీలతోపాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు జరిపారు. రూ. కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణలు రావడంతో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు జూబ్లిహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై శుక్రవారం(డిసెంబర్ 20, 2019) దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి.. సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. 

లావణ్య త్రిపాఠి ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు జరిపారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు వంటి ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి డీజీజీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.