Doctor Attempt Murder : భార్యను చంపేందుకు వచ్చి బావమరిదిపై దాడి
భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేస
- chvmurthy
- Published On : November 20, 2021 / 01:54 PM IST
Doctor Attempt Murder
Doctor Attempt Murder : భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
గచ్చిబౌలీలోని మై హోమ్ భుజా లో నివాసముంటున్న మల్లా రెడ్డి,జ్యోత్స్న దంపతులు డాక్టర్లు గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోత్స్న భర్త నుంచి విబేధించి తన పుట్టింటికి చందానాయక్ తండాకు వెళ్లిపోయింది. మల్లారెడ్డికి… భార్య తన వద్దకు రావటంలేదనే కోపం పెరిగిపోయింది. దీంతో ఆమెను హతమార్చాలనుకున్నాడు.
Also Read : Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు
ఒక కత్తి కొనుగోలు చేసి శుక్రవారం సాయంత్రం అత్తగారింటికి వచ్చాడు. అక్కడ భార్యతో గొడవపడుతుండగా ఆమె చెల్లెలు, తమ్ముడు శివానంద రెడ్డి కూడా గొడవలో కలుగ చేసుకున్నారు. ఆగ్రహించిన మల్లారెడ్డి కత్తితో బావమరిది శివానంద రెడ్డిని వెన్నులో పొడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి శివానంద రెడ్డిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
