డాక్టర్ గారు లంచ్ లో ఉన్నారు. ఇది లంచ్ టైమ్. ఇప్పుడు చూడటం కుదరదు. ఇంటకి వెళ్లి తరువాత రండి.. ఆస్పత్రిలో నర్స్ చెప్పడంతో ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది.
డాక్టర్ గారు లంచ్ లో ఉన్నారు. ఇది లంచ్ టైమ్. ఇప్పుడు చూడటం కుదరదు. ఇంటకి వెళ్లి తరువాత రండి.. ఆస్పత్రిలో నర్సు చెప్పడంతో ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన బెంగళూరులోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. గంగాలమ్మ, చోడప్ప దంపతులు. గంగాలమ్మ నిండు గర్భిణి. సడన్ గా నొప్పులు స్టార్ కావడంతో చౌడప్ప భార్యను హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లాడు. ఒకవైపు భార్య పురిటినొప్పులతో బాధపడుతోంది. మరోవైపు డాక్టర్ లంచ్ కు వెళ్లాడు. ఏం చేయాలో తోచలేదు. నర్సును వేడుకున్నాడు. ఇది లంచ్ టైమ్.. అంటూ గంటల కొద్ది వేయింట్ చేయించారు.
తల్లీబిడ్డ సురక్షితం.. డాక్టర్ పై ఫిర్యాదు
చివరికి ఇంటికి వెళ్లి తరువాత రండి అని నర్సు చెప్పడంతో చోడప్ప తన భార్యను తీసుకొని బయల్దేరాడు. అంతలో భార్య గంగాలమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. కొందరు మహిళలు గుంపుగా చేరి మహిళా ప్రసవానికి సాయంగా వచ్చారు. నడిరోడ్డుపైనే గంగాలమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాధితుడు చోడప్ప ఫిర్యాదు మేరకు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి నీరజ్ పాటిల్ విచారణ చేపట్టారు. సదరు డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.