సైనేడ్ తినిపించి 20మంది మహిళల్నిహత్యాచారాలు చేసిన శాడిస్టు టీచర్‌కు జీవితఖైదు

  • Publish Date - February 19, 2020 / 05:53 AM IST

వాడో రేపిస్ట్ కమ్ శాడిస్టు సీరియల్ కిల్లర్. ఒంటరిగా ఉండే అమ్మాయిల్నే టార్గెట్ చేస్తాడు.  ప్రేమ పేరుతో నమ్మించి వారికి సైనేడ్ తినిపించి అత్యాచారాలు చేసి రాక్షసానందం పొందేవాడు. అలా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 20మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి..వారికి సైనేడ్ తినిపించి వారు అపస్మారస్థితిలో ఉండగా అత్యాచారం చేసేవాడు. అలా కొంతమంది అమ్మాయిల్ని చంపేసేవాడు. కొన్నిసార్లు పారిపోయేవాడు.  అన్ని నేరాలు చేసినవాడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వాడి నేరాలను కోర్టులో నిరూపించారు. దీంతో ఆ శాడిస్టు రేపిస్టుకు కోర్టు జీవిత ఖైదు విధిస్తు తీర్పునిచ్చింది. సైనేడ్ తినిపించి రేప్ చేసే వాడు సైనేడ్ మోహన్ గా పేరు పెట్టారు పోలీసులు. 

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో యువతులు అత్యాచారానికి గురై సైనేడ్ కారణంగా చనిపోయిన ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంతో సైనేడ్ కిల్లర్ 2009లో పోలీసులకు పట్టుపడ్డాడు. పోలీసుల విచారణలో సైనేడ్ మోహన్ చేసిన ఘాతుకాలన్నీ చెప్పటంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అలా 20 మంది యువతులను అత్యాచారాల వ చేసి చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. 

సైనేడ్ మోహన్ నేరాల చిట్టా 
ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్‌ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పే సైనేడ్ మోహన్.. వారిని రూమ్‌కి తీసుకెళతాడు. తర్వాత వారిని రూమ్‌కి తీసుకెళ్లి సైనేడ్ పూసిన పదార్థాలు తినిపించేవాడు. వారు అపస్మారక స్థితిలోకి జారుకున్నాక అత్యాచారం చేసేవాడు. అది వాడి శాడిజానికి పరాకాష్ట .తరువాత సదరు యువతి చచ్చిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్నా అక్కడి నుంచి రిపోయేవాడు.కొంతమందిని చంపేసేవాడు.

ఈ విధంగా సైనేడ్ మోహన్ 20 మంది యువతులను అత్యాచారం చేసి చంపేసినట్లుగా సైనేడ్ మోహన్  పోలీసుల విచారణలో తెలిపాడు. వీటన్నింటిపై మోహన్ పై పోలీసులు  కేసులు నమోదు చేశారు. 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్‌కో యూనిట్‌కు పని కోసం వచ్చిన కేరళ యువతితో మోహన్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లాడు..ఎలాగూ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం కదా..మనం ఇప్పటినుంచి వైవాహిక జీవితం మొదలు పెడితే తప్పేంటి..అని నమ్మించాడు. ఆమె ఒప్పుకోలేదు. కానీ మోహన్ ఆమెను వదల్లేదు..ఇద్దరూ శారీకంగా కలిశారు. 

తర్వాతి రోజు ఉదయం ఆమెను బస్టాండ్‌కు తీసుకెళ్లి తనదైన శైలిలో మాయమాటలు చెప్పి నమ్మించాడు. అవసరం ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆమె నగలన్నీ తీసుకున్నాడు. అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో గర్భనిరోధక మాత్రలు అని నమ్మించి సైనేడ్ పూసి స్వీటు తినిపించాడు. దాంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆమె చచ్చిపోయిందని నిర్ధారించుకున్నాక..నగలు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించాడు.  

ఇలా వాడి అరాచకాలకు 20మంది అమ్మాయిలు బలైపోయారు. ఈ క్రమంలో అతడిని ఎట్టకేలకు 2009లో పట్టుకుని విచారించగా కేరళ యువతి కంటే ముందే 19 మంది అదేవిధంగా రేప్ చేసి చంపేసినట్లు అంగీకరించాడు. కేరళ యువతి కేసులో నేరం నిరూపణ కావడంతో న్యాయస్థానం అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

సైనేడ్ తినిపించి 20మంది మహిళలపై అత్యాచారం చేసిన శాడిస్టుకు జీవిత ఖైదు సైనేడ్ మోహన్ కు కర్ణాటకలోని మంగుళూరు న్యాయస్థానం సోమవారం (ఫిబ్రవరి 17,2020) జీవితఖైదు విధించింది. జీవిత ఖైదుతో పాటు రూ.25వేల జరిమానా విధించింది. కాగా గతంతో అతను చేసిన దారుణమైన ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించింది. ఆ తరువాత మరణశిక్షను జీవితఖైదుగా మార్చబడ్డాయి.  కాగా సైనేడ్ మోహన్ గా పేరుగాంచిన ఈ శాడిస్ట్ రేపిస్ట్ 57 ఏళ్ల మాజీ స్కూల్ టీచర్ అని పోలీసులు చెప్పారు. 

Read More>> ట్రంప్ రాక కోసం రూ.100కోట్ల ఖర్చుతో.. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియంలో!