Family Suicide Attempt : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని కుటుంబం ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని అధికారుల ముందే ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది.
- bheemraj
- Published On : September 19, 2022 / 09:01 PM IST
Family Suicide Attempt
Family Suicide Attempt : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని అధికారుల ముందే ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది.
వెంటనే అక్కడున్న సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు అధికారుల ముందు ఆరోపణలు చేశారు. ఆఫీసు ఎదుట తమ చేతిలోని పత్రాలను చూపుతూ గోడు వెళ్లబోసుకున్నారు.
బెజ్జం వెంకన్న, నాగమణి మీసాలా సైదులు, అజయ్ కుమార్, అనిల్, దుర్గమ్మ తమ సొంత భూమిని ఆక్రమిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమది సొంత పట్టాభూమి అని.. దీనికి సంబంధించి పాస్ బుక్ తదితర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
