Newborns Killed : దారుణ ఘటన.. 15మంది నవజాత శిశువులు సజీవ దహనం..

Fire Accident In Pakistan Newborns Killed : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15మంది శిశువులు సజీవదహనం అయ్యారు.

Fire Accident Pakistan

Fire Accident In Pakistan Newborns Killed : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆస్పత్రిలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆస్పత్రిలోని చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో దాదాపు 15మంది నవజాత శిశువులు మృతిచెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Also Read : AE Nukaraju Family Case : అమ్మను తీవ్రంగా కొట్టేవాడు.. సాధిక్ అరాచకాల గురించి సౌజన్య కుమారుడు రియాన్ష్ చెప్పిన సంచలన విషయాలు ఇవే..

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రి వార్డులో మొత్తం 16మంది నవజాత శిశువులు ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. వారిలో ఒక్క శిశువును మాత్రమే ప్రాణాలతో కాపాడారు. మిగిలిన వారంతా మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. క్షణాల్లో మంటలు విస్తరించడంతో శిశువులను ప్రాణాలతో కాపాడేందుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.