పొగాకు గోదాంలో అగ్నిప్రమాదం : రూ.100కోట్లు నష్టం

  • Publish Date - May 6, 2019 / 07:10 AM IST

గంటూరు జిల్లా పొత్తూరు దగ్గర పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 15వేల పొగాకు కేసులు దగ్ధమయ్యాయి. 100 కోట్ల రూపాయల  ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి గోదాం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో నాలుగు గోదాంలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.  రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

మంటలు పక్కన ఉన్న గోదాంలకు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగంతో గోదాంలో పనిచేసే కార్మికులు భయాందోళనకు గురయ్యారు. గోదాం నుంచి బయటకు పరుగులు తీశారు.  అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.