Former MLC vinayak mete died on road accident
Vinayak Mete: ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ, మరాఠా నేత వినాయక్ మేటే(52) మరణించారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తుండగా వినయాక్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. రాయసాని పోలీస్ స్టేషన్ పరిధిలో మదప్ టన్నెల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 5:05 గంటలకు ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. మేటేతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని వెంటనే నవీ ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మేటే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేటే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వినాయక్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు. ఆయనకు రాజకీయ విషయాల కంటే సామాజిక సమస్యలపైనే ఎక్కువ దృష్టి సారించేవారిన కాంగ్రెస్ నాయకుడు ఆశోక్ చౌహన్ అన్నారు. మరాఠా రిజర్వేషన్ల కోసం విశేష కృషి చేసిన గొప్పవ్యక్తి అని పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Rahul Gandhi is silent: రాజస్తాన్ ఘటనపై రాహుల్ గాంధీకి బీజేపీ ప్రశ్నల వర్షం