దిశ హత్యాచార ఘటన జరిగిన చటాన్‌పల్లిలో మరోసారి కలకలం రేగింది. చటాన్‌పల్లికి చెందిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది.
దిశ హత్యాచార ఘటన జరిగిన చటాన్‌పల్లిలో మరోసారి కలకలం రేగింది. చటాన్‌పల్లికి చెందిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. స్నేహిత అనే బాలికను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మంగళవారం (డిసెంబర్ 17, 2019) సాయంత్రం బాలిక స్కూలు నుంచి ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లాడు.
చాక్లెట్లు ఆశచూపి స్నేహితను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పాప తండ్రి శివకుమార్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బృందాలుగా విడిపోయి కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. చర్లపల్లి జైలుకు తరించిన నిందితులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లిలో దిశ అత్యాచారం, హత్య జరిగిన ప్రదేశానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి.