Private Photos : వామ్మో.. బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో 13వేల ప్రైవేట్ ఫోటోలు, షాక్‌లో ప్రియురాలు

ఆ ఫోన్ నిండా అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలే. పదులు, వందలు కాదు.. ఏకంగా 13 వేలకు పైగా ప్రైవేట్ ఫొటోలు ఉన్నాయి.

Private Photos In Phone (Photo : Google)

బెంగళూరులో వెలుగు చూసిన ఓ ఘటన సంచలనంగా మారింది. అందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేయగా.. అందులో 13వేలకు పైగా మహిళల ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయి. వాటిలో తనకు సంబంధించిన ఫోటోలు కూడా ఉండటం చూసి ఆమె మరింత నిర్ఘాంతపోయింది. ఆమెకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

కొలీగ్‌తో యువతి సహజీవనం..
వివరాల్లోకి వెళితే.. ఓ యువతి (22) బెంగళూరులోని ఒక బీపీవోలో జాబ్ చేస్తోంది. కొంతకాలంగా ఆమె తన కొలీగ్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. రొమాన్స్ లో ఉండగా యువకుడు.. ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇది ఆ యువతికి నచ్చ లేదు. తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా అతడి ఫోన్ నుంచి ఎలాగైనా ఆ ఫొటోలను, వీడియోలను డిలీట్ చేయాలని నిర్ణయించుకుంది.

Also Read : పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్తున్నారా? తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో అన్నీ ”ఆ” ఫోటోలే..
ఈ క్రమంలో బాయ్ ఫ్రెండ్ నిద్రిస్తుండగా అతడి ఫోన్ తీసుకుని ఓపెన్ చేసిన యువతి షాక్ కి గురైంది. అందులో ఏమున్నాయో చూసి దిమ్మతిరిగిపోయింది. ఆ ఫోన్ నిండా అమ్మాయిల ప్రైవేట్ ఫోటోలే. పదులు, వందలు కాదు.. ఏకంగా 13 వేలకు పైగా ప్రైవేట్ ఫొటోలు ఉన్నాయి. అందులో కొన్ని ఫొటోలు తనవి కాగా మరికొన్ని తమ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులవిగా గుర్తించింది. ఆ యువతి వెంటనే తన సీనియర్లకు ఈ విషయం తెలిపింది. వారి సూచనలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అన్ని కోణాల్లో విచారణ..
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. యువకుడి ఫోన్ లో ఉన్న వాటిలో కొన్ని నిజమైన ఫొటోలు కాగా, మరికొన్ని మార్ఫింగ్ చేసినవిగా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ యువకుడు వాటి ఆధారంగా ఇప్పటివరకు ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదని పోలీసుల విచారణలో తెలిసింది. ఇప్పటివరకూ వాటిని అడ్డం పెట్టుకుని ఎవరినీ బెదిరించకపోయినా.. భవిష్యత్తులో బ్లాక్ మెయిల్ కు పాల్పడే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన బాధితుల నుంచి వ్యక్తమైంది. యువతి ఫిర్యాదుతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా, ఫోన్ లో 13వేలకు పైగా ప్రైవేట్ ఫోటోలు ఉండటం సర్వత్రా సంచలనంగా మారింది.

Also Read : ఘోరం.. 12ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన క్లాస్‌మేట్స్

 

ట్రెండింగ్ వార్తలు