Shocking Video : పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్తున్నారా? తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

పిల్లలను పట్టించుకోకుండా షాపింగ్ లో మునిగిపోతే.. మీ పిల్లల ప్రాణాలకే ప్రమాదం. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Shocking Video : పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్తున్నారా? తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

Glass Door Falls On Girl (Photo : Google)

పిల్లలను తీసుకుని షాపింగ్ కు వెళ్లే తల్లిదండ్రులకు ఈ ఘటన ఓ హెచ్చరిక లాంటిది. ఇకపై తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి పెద్ద పెద్ద షాపులకు వెళ్లినప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. పిల్లలను వదిలేసి షాపింగ్ చేసుకుంటాము అంటే కుదరదు. పిల్లలను పట్టించుకోకుండా మీ పనిలో మీరు మునిగిపోతే.. మీ పిల్లల ప్రాణాలకే ప్రమాదం. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తోందంటే.. ఓ షో రూమ్ లో దారుణం జరిగింది. గ్లాస్ డోర్ మీద పడి మూడేళ్ల పాప చనిపోయింది.

ఆడుకుంటూ వెళ్లి తిరిగిరాని లోకాలకు..
పంజాబ్ రాష్ట్రం లూథియానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గార్మెంట్ షో రూమ్ లో పెద్ద గ్లాస్ డోర్ మీద పడి చిన్నారి మరణించింది. సిటీలోని గుమర్ మండీ మార్కెట్ లోని గార్మెంట్ షో రూమ్ లో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు తమ మూడేళ్ల పాపతో కలిసి గార్మెంట్ షో రూమ్ కి వెళ్లారు. వాళ్ల షాపింగ్ చేసుకునే పనిలో మునిగిపోయారు. ఇంతలో వారి మూడేళ్ల పాప ఆడుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో డోర్ వద్దకు వెళ్లింది. అక్కడ పెద్ద గ్లాస్ డోర్ ఉంది. ఆ డోర్ ని రౌండ్ గా తిప్పుతూ ఆడుకుంటోంది.

Also Read : ఘోరం.. 12ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసి వీడియో తీసిన క్లాస్‌మేట్స్

అమాంతం పాప మీద పడిన గ్లాస్ డోర్..
ఇంతలో ఎవరూ ఊహించని దారుణం జరిగిపోయింది. ఆ పెద్ద గ్లాస్ డోర్ అమాంతం ఊడి పాప మీద పడింది. అంతే, అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరుగు పరుగున వెళ్లి గ్లాస్ డోర్ ను పైకి లేపి పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భారీ బరువు ఉన్న గ్లాస్ డోర్ మీద పడటంతో పాప తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పాపం ఎవరిది?
ఈ ఘటన నెటిజన్లను షాక్ కి గురి చేసింది. చాలా బాధాకరం అని వాపోయారు. పాప మరణానికి గార్మెంట్ షాప్ యాజమాన్యమే కారణం అని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పాప ప్రాణం పోవడానికి కారణమైన గార్మెంట్ షాప్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్లాస్ డోర్ ని సరిగా ఫిక్స్ చేయలేదని, ఆ కారణంగానే డోర్ పడిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో పాప తల్లిదండ్రుల తీరుపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. వారి వైఖరిని తప్పుపట్టారు. పాపను జాగ్రత్తగా చూసుకోకుండా వదిలేశారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీరియస్ అయ్యారు. పిల్లలను చూసుకునే బాధ్యత లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్..
ఈ ఘటన పిల్లలతో కలిసి షాపింగ్ కు వెళ్లే తల్లిదండ్రులు అందరికీ ఓ హెచ్చరిక లాంటిది. చిన్నారులను తమతో తీసుకెళ్లే పేరెంట్స్ కచ్చితంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. పిల్లలను వదిలేయడానికి వీల్లేదు. వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ తర్వాత ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు.