Cheating : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

భలే మంచి బేరం అనుకుని మురిసిపోయింది. ఆ మహిళ అడిగిందే ఆలస్యం.. వృద్ధురాలు 4కోట్ల 35లక్షలు ఆ ఇచ్చింది.

Cheating : కొంపముంచిన అత్యాశ.. 4కోట్లు పోగొట్టుకున్న వృద్ధురాలు, ఘరానా మోసం

Old Woman Cheated In Mumbai

చీటర్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మనలోని అత్యాశ క్రిమినల్స్ కు వరంగా మారుతోంది. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, భారీగా లాభాలు వస్తాయని ఆశపడి ఉన్నదంతా కోల్పోతున్నాం. చాలా నేరాల్లో బాధితుల దురాశే మోసపోవడానికి కారణం అవుతోంది. క్రిమినల్స్ ఎరకు చిక్కి సర్వం కోల్పోతున్నారు. తాజాగా ముంబైలో అలాంటి ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. చీటర్ ఎరకు చిక్కిన 71ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 4కోట్లు మోసపోయింది.

సౌత్ ముంబైలో ఓ వృద్ధురాలు నివాసం ఉంటుంది. వృద్ధురాలికి ఓ మహిళ పరిచయమైంది. తన పేరు మిసెస్ భరద్వాజ్ అని చెప్పింది. తన భర్త 2004లో తన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో 4లక్షలు డిపాజిట్ చేశాడంది. ఇప్పుడు ఆ డబ్బు 11కోట్లు అయ్యిందని వృద్ధురాలితో చెప్పింది. తనకు డబ్బు అవసరం ఉందని, 4కోట్లు కావాలని అడిగింది. తనకు 4 కోట్లు ఇస్తే తన దగ్గరున్న 11 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చేస్తానని ప్రలోభ పెట్టింది. దీంతో వృద్ధురాలు ఆమె మాటలను నమ్మేసింది. డబ్బుకు ఆశ పడింది.

Also Read : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య

భలే మంచి బేరం అనుకుని మురిసిపోయింది. 4కోట్లు ఇస్తే 11 కోట్లు తన సొంతం అవుతాయని కక్కుర్తికి పోయింది. ఆ మహిళ అడిగిందే ఆలస్యం.. వృద్ధురాలు 4కోట్ల 35లక్షలు ఆ మహిళకు ఇచ్చింది. తనకు 4 కోట్లు ఇస్తే తన దగ్గరున్న 11 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టిన మహిళ.. డబ్బు చేతికి అందగానే ఉడాయించింది.

దీంతో తాను మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు లబోదిబోమంది. అత్యాశకు పోయి అంతా పోగొట్టుకున్నాను అని వాపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 44లక్షల నగదు రికవరీ చేశారు. నిందితుల నుంచి 43 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు సుమారు 44లక్షలు రికవరీ చేశారు. మిగిలిన డబ్బుని కూడా రికవరీ చేసే పనిలో పడ్డారు.

Also Read : కాకినాడలో డాక్టర్ ఆత్మహత్య.. వైసీపీ నేతల అనుచరుల వేధింపులే కారణమంటున్న ఫ్యామిలీ