Kakinada : కాకినాడలో డాక్టర్ ఆత్మహత్య.. వైసీపీ నేతల అనుచరుల వేధింపులే కారణమంటున్న ఫ్యామిలీ
డాక్టర్ నున్నా కిరణ్ చౌదరి నిన్న (శనివారం) రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

kakinada
Kakinada Doctor Kiran : కాకినాడ జిల్లాలో ఓ డాక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ అశోక్ నగర్ కు చెందిన డాక్టర్ నున్నా కిరణ్ చౌదరి నిన్న (శనివారం) రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ డాక్టర్ కిరణ్ మృతి చెందారు.
అతని మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతల అనుచరుల వేధింపుల కారణంగానే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, తన కొడుకు మృతికి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనుచరులే కారణమని తల్లి అంటున్నారు.
Sri Sathya Sai : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య