Sri Sathya Sai : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య

బుక్కపట్నంలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Sri Sathya Sai : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య

Sub Registrar Srinivasa Naik

Sri Sathya Sai Sub Registrar Srinivasa Naik : శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నాడు. నవంబర్ 23వ తేదీన బుక్కపట్నంలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి భోజనం చేసేందుకు చేయి కడుక్కుని వస్తానని బయటకు వచ్చిన శ్రీనివాస నాయక్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

CM KCR : సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు.. ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ప్రసంగించొద్దని హెచ్చరిక

ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నాడు.