Up Officer
UP Govt Officer Arrested : ఉద్యోగినిలపై అధికారులు బరి తెగిస్తున్నారు. వారిని లైంగికంగా వేధిస్తున్నారు. కొంతమంది లోపలే బాధ పడుతూ…పని చేస్తూ వస్తున్నారు. కొంతమంది అధికారుల తాట తీస్తుంటారు. వీరి చేష్టలను..వీడియోలు తీసి.. బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తుంటారు. ఇలాగే..ఉత్తర్ ప్రదేశ్ లో సెక్రటరీ స్థాయి అధికారి చేసిన వేధింపులను ధైర్యంగా రికార్డు చేసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ అధికారిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : Hyderabad : రూ. 5తో 40 కి.మీటర్లు..బ్యాటరీ సైకిల్ రూపొందించిన హైదరాబాద్ వాసి
వెంటనే అతడిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వెలుబుచ్చారు. దీనిపై యూపీ సర్కార్ స్పందించింది. లైంగికంగా వేధించిన ఆ అధికారిని అరెస్టు చేయించి..కటకటాల్లోకి నెట్టింది. జైల్లో ఉన్న ఫొటో ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. లక్నో సెక్రటేరియట్ లో మైనార్టీ సంక్షేమ శాఖలో సెక్రటరీ స్థాయి అధికారిగా ఇచ్చారామ్ యాదవ్ పనిచేస్తున్నారు. ఆ సెక్షన్ లో ఓ మహిళ పని చేస్తున్నారు. ఈమెపై అతను లైంగికంగా వేధిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కోరిక తీర్చాలంటూ..బలవంతం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.
Read More : Petrol Price : స్థిరంగానే చమురు ధరలు, ఏ నగరంలో ఎంత ?
నవంబర్ 10వ తేదీన అదే విధంగా లైంగికంగా వేధించాడు. వేధిస్తుండగా..రహస్యంగా బాధితురాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. వేధిస్తున్న ఆ అధికారిని పలుమార్లు దూరంగా నెట్టేయడం కనిపించింది. కానీ ఆ అధికారి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించాడు. బాధితురులు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి హుసైన్ గంజ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎంవో మీడియా సలహాదారు షహలబ్ మణి త్రిపాఠి..అతడి ఫోటో..అరెస్టు చేస్తున్న దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
हैवान सचिवालय अफ़सर इच्छाराम यादव गिरफ्तार कर लिया गया गया है, “माकूल इलाज“ लगातार जारी है। https://t.co/5PGwmqWOn8 pic.twitter.com/Y01mygZ2n3
— Shalabh Mani Tripathi (@shalabhmani) November 11, 2021