Hyderabad : రూ.5తో 40కిలోమీటర్లు.. బ్యాటరీ సైకిల్ రూపొందించిన హైదరాబాద్ వాసి

ఓ వ్యక్తి కేవలం రూ. 5తో 40 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా...బ్యాటరీ సైకిల్ రూపొందించాడు. ఇతను హైదరాబాద్ కు చెందిన వారు.

Hyderabad : రూ.5తో 40కిలోమీటర్లు.. బ్యాటరీ సైకిల్ రూపొందించిన హైదరాబాద్ వాసి

Cycle

Battery Operated Bicycle : ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్స్ పెరుగుతున్నాయి. పలు కంపెనీలను వాహనాలను రూపొందించి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా…ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు పలు రాయితీలు ప్రకటిస్తున్నాయి. కాలుష్యాన్ని చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని అవగాహన కల్పిస్తున్నాయి. అయితే..ఇదిలా ఉంటే..ఓ వ్యక్తి కేవలం రూ. 5తో 40 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా…బ్యాటరీ సైకిల్ రూపొందించాడు. ఇతను హైదరాబాద్ కు చెందిన వారు. సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పని చేస్తున్న ఇతను…వినూత్నంగా రూపొందించిన సైకిల్ అందర్నీ ఆకట్టుకొంటోంది. నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని..పర్యావరణ పరిరక్షణ ప్రతొక్కరి బాధ్యత అని తనవంతు సాయంగా..బ్యాటరీ సైకిల్ రూపొందించడం జరిగిందని..సైకిల్ కావాలని అనుకొనే వారికి తాను సాయం అందిస్తానని ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వెల్లడించారు.

Read More : Padma Shri: దేశవ్యాప్తంగా కంగనా పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్

వెంగళరావు నగర్ ప్రాంతంలో నివాసం ఉండే…అబ్దుల్ ఆసిమ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మాసాబ్ ట్యాంకులోని శాంతినగర్ లో కార్యాలయానికి వెళ్లి రావడానికి స్కూటీ ఉపయోగించేవాడు. స్కూటీలో పెట్రోల్ పోయడానికి ప్రతి రోజు రూ. 100 ఖర్చు పెట్టేవాడు. డబ్బు దుబారాతో పాటు..తాను పర్యావరణానికి హానీ చేస్తున్నట్లు గ్రహించాడు. ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని కాలనీలో ఉన్న ప్రముఖ సైంటిస్ట్ రఘునందన్ కు తెలియచేశాడు. ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నాడు.

Read More : Petrol Price : స్థిరంగానే చమురు ధరలు, ఏ నగరంలో ఎంత ?

ఇంట్లో ఉన్న పాత సైకిల్ ను బయటకు తీశాడు. ఈ సైకిల్ కు 250 వాట్స్ BLDC, మోటార్, 18 A.h వోల్టుల రెండు బ్యాటరీలు, లైట్, హారన్, ఎక్స్ లేటర్ లతో పాటు..ఇతర విడిభాగాలను సైకిల్ కు అమర్చాడు. దీనికింతటికీ రూ. 6 వేల 500 ఖర్చు అయ్యింది. డబ్బు అధికంగా ఖర్చు అవుతుందని గ్రహించిన..అబ్దుల్ సెకండ్ హ్యాండ్ బ్యాటరీ కొనుగోలు చేశాడు. సైకిల్ కు వెనుకభాగంలో దీనిని అమర్చారు. అనంతరం ఈ సైకిల్ ను బయటకు తీసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తున్నాడు. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే…ఎలా…డౌట్ రావొచ్చు. నో ప్రాబ్లమ్ అంటున్నాడు. సైకిల్ పెడళ్లతో తొక్కుతూ..వెళ్లవచ్చు అని వెల్లడించాడు. ఇందులో ప్రధానమైంది ఛార్జింగ్. రెండు బ్యాటరీలకు ఛార్జింగ్ పెట్టడానికి కేవలం రూ. 5 మాత్రమే అవుతుందని తెలిపాడు. కేవలం రూ. 5తోనే…ఆఫీసుకు వెళ్లివస్తున్నట్లు, దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని ఈ యువ ఇంజినీర్ పేర్కొన్నారు.