కశ్మీర్ లో గ్రనేడ్ ఎటాక్…ఐదుగురు జవాన్లకు తీవ్రగాయాలు
- venkaiahnaidu
- Published On : October 5, 2019 / 06:22 AM IST
జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు లక్ష్యంగా శనివారం(అక్టోబర్-5,2019)అనంత్ నాగ్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ బయట గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ఉగ్రమూకలను పట్టుకునేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ వ్యాలీలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దాడులకు పాల్పడటం ఇది రెండవసారి.
