Human Organs Sell : మృతదేహాలను ముక్కలు చేసి, ఆన్‌లైన్‌లో అవయవాలు అమ్మకం ..

మృతదేహాలను ముక్కలు చేసిన ఆన్‌లైన్‌లో శరీర భాగాలను అమ్మేస్తున్నారు. ఈ దారుణ వ్యాపారం మార్చురీ మేనేజర్ చేస్తున్న నాలుగేళ్లుగా చేస్తున్నా బయటపడలేదు. ఇటీవలే బయపటడింది.

harvard university

Human Organs Sell At harvard university : అమెరికాలో ఓ భయానక విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహానలను ముక్కలు చేసిన వాటినుంచి అవయవాలు వేరు చేసిన వాటిని ఏవో వస్తువుల్లా అమ్మేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో మానవ శరీర భాగాలను అమ్మేస్తున్నారు. అమెరికాలో హార్వర్డ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో ఈ దారుణం వెలుగుచూసింది. అంతర్జాతీయంగా పేరుపొందిన వర్శిటీలో ఇంతటి దారుణం జరగటం షాకింగ్ కలిగించింది. హార్వర్డ్ యూనివర్శిటీలో మార్చురీ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఈ దారుణమైన వ్యాపారం చేస్తున్నాడని గుర్తించారు.

వైద్య విద్యార్ధుల పరిధనలో కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలతో వ్యాపారం చేస్తున్నాడు వర్శిటీ మార్చురీ మేనేజర్. అమెరికాలో ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్‌ మెడికల్‌ వర్శిటీలో మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను ఆన్‌లైన్‌లో అమ్ముతున్న దారుణమైన ఘటన భయానకంగా మారింది.

Starbucks : స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశం

కొంతమంది తాము చనిపోతు తమ మృతదేహాలను ప్రాక్టికల్స్ కోసం విరాళంగా ఇవ్వాలని భావిస్తారు. అలా విరాళంగా వచ్చిన మృతదేహాలను ముక్కలు చేసి అవయవాలను అమ్మేస్తున్నాడు వర్శిటీ మార్చురీ మేనేజర్ సెడ్రిక్‌ లాడ్జ్‌. వర్శిటీ మార్చురీలో ఉండే మృతదేహాల భాగాలను వేరుచేసి వాటిని గాఫ్స్‌టౌన్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఆ తరువాత అతని భార్య, మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో వాటిని అమ్మేవాడు. 2018 నుంచి 2022 మధ్య అంటే కేవలం నాలుగేళ్లలో దాదాపు ఈ అమ్మకాలు లక్ష డాలర్ల లావాదేవీలు జరిగాయని తెలుస్తోంది. ఓ మహిళ ఈ అవయవాలు కొనుగోలు చేయటంతో ఈ విషయం బటయపడింది. ఏఏ శరీర భాగాలు కావాలో గుర్తించేందుకు సెడ్రిక్ తరచు ఇద్దరు వ్యక్తులను వర్శిటీకి తీసుకొచ్చేవాడు. అలా వారు ఇవి కావాలని చెబితే వాటిని తీసి వారికి అందించేవాడు.

ఈ దారుణ అమ్మకాల విషయం ఓ మహిళ కొనుగోలు ద్వారా బయపటపడటంతో అమెరికాకు చెందిన ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. వర్శిటీ మార్చరీ మేనేజర్ సెడ్రిక్ లాడ్్ ను అరెస్ట్ చేశారు. ఈ అమ్మకాల లో పాల్గొన్న మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. సెడ్రిక్ పై మృతదేహాల అవయవాలు అమ్ముతున్నాడనే ఆరోపణలు రావటంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది వర్శిటీ.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పెద్ద సాహసానికే దిగిన ఆఫ్రికా నేతలు