Starbucks : స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశం

శ్వేత జాతీయురాలిని ఉద్యోగం నుంచి తొలగించిందనందుకు ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ తగిలింది. సదరు ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Starbucks : స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాలని ఆదేశం

Starbucks Coffee

ప్రముఖ అంతర్జాతీయ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఓ ఉద్యోగినిని సంస్థ నుంచి తొలగించినందుకు 25.6 మిలియన్ల డాలర్లు అంటే రూ.201 కోట్లు చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ ఆదేశించింది. 2018లో ఓ ఉద్యోగిని వేసిన కేసులో తాజాగా ఫెడరల్ జ్యూరీ ఈ ఆదేశాలు జారీ చేసింది.

న్యూజెర్సీలోని ఫిలడెల్ఫియా బ్రాంచ్‌లో స్టార్‌బక్స్‌ స్టోర్‌ లో ఓ శ్వేతజాతీయురాలు 13 సంవత్సరాలుగా రీజినల్‌ మేనేజర్‌ గా పనిచేస్తోంది. ఆమె పేరు షానన్‌ ఫిలిప్స్‌. ఈక్రమంలో 2018లో స్టార్‌బక్స్‌ స్టోర్‌ కు ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. వారి అక్కడి వాష్ రూమ్ వాడుకోవాలని అడిగారు. కస్టమర్లకు అనుమతి ఉంటుంది గానీ.. మీరు స్టోర్ లో ఏమీ కొనుగోలు చేయలేదు. కాబట్టి వాష్ రూమ్ ఉపయోగించుకోవటం కుదరదు అని తెలిపారు షానన్. అలా స్టోర్ సిబ్బందితో గొడవకు దిగారు.

ఆ గొడవ కాస్తా పెద్దది అయ్యింది. దీంతో స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయటంతో వారు వచ్చి సదరు గొడవకు దిగిన వారిని (నల్లజాతీయులను) అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ అరెస్టు దృశ్యాలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. నల్లజాతీయులపై వివక్ష చూపిస్తున్నారు అంటూ నిరసనకు దారితీసింది. నిరసనలు తీవ్రస్థాయికి వెళ్లాయి.

Sri Lanka : మాజీ సైనికుడి కిడ్నీలో 801 గ్రాముల రాయి .. ఇదో ప్రపంచ రికార్డు

దీంతో  సంస్థ ఈ ఆందోళనల్ని సద్దుమణిగేలా చేయటానికి చర్యలు తీసుకోవాలని భావించింది.  దీంట్లో భాగంగానే రీజినల్‌ మేనేజర్‌ శ్వేత జాతీయురాలిని మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ ఆందోళనలు సద్దుమణిగేలా చేసేందుకు చర్యలు ప్రారంభించిన సంస్థ.. రీజినల్‌ మేనేజర్‌ షానన్‌ ఫిలిప్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. కానీ మేనేజర్‌ను మాత్రం తొలగించలేదు. ఎందుకంటే రీజినల్‌ మేనేజర్‌ షానన్ శ్వేత జాతీయురాలు. మేనేజర్‌ నల్ల జాతీయుడు కావడం గమనించాల్సిన విషయం.

దీంతో షానన్ తన తప్పులేకపోయినా తనను ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయారు. ఇద్దరు వ్యక్తుల అరెస్టుకు తననే కారణంగా చూపిస్తు.. తన తప్పు ఏమీ లేకపోయినా ఉద్యోగం నుంచి తొలగించం ఏంటీ నాకు న్యాయం చేయమని కోరుతు..శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష చూపారంటూ 2019లో స్టార్‌బక్స్‌పై దావా వేశారు. అలా ఇన్నాళుగా కేసు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్‌ జ్యూరీ.. స్టార్‌బక్స్‌ సంస్థ సదరు ఉద్యోగినిపై జాతి ఆధారంగా వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ 25.6 మిలియన్ల డాలర్ల (భారత కరెన్సీలో రూ.210కోట్లు) జరిమానాను విధించింది.