Sri Lanka : మాజీ సైనికుడి కిడ్నీలో 801 గ్రాముల రాయి .. ఇదో ప్రపంచ రికార్డు

అతనో మాజీ సైనికుడు. అతని కిడ్నీలో ఏకంగా 801గ్రాముల రాయి బరువుగల రాయి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిగా రికార్డు పొందింది.

Sri Lanka  : మాజీ సైనికుడి కిడ్నీలో 801 గ్రాముల రాయి .. ఇదో ప్రపంచ రికార్డు

Man 801 Grams stone In kidney

Sri Lanka Man 801 Grams stone In kidney  : కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వాటిని డాక్టర్లు సర్జరీ ద్వారా తొలగించారనే వార్తలు వింటుంటాం. చాలామంది ఇటువంటి ఇబ్బందులకు గురి అయినవారు ఉన్నారు. కానీ ఆ రాళ్లు చిన్న చిన్నగా ఉంటాయి. కానీ ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న రాయి ఏకంగా 801గ్రాముల బరువుంది. ఆ రాయిని డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. కిడ్నీలో ఇంత పెద్ద రాయి పెరగటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇదో ప్రపంచ రికార్డు అని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌గా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ రాయి 801 గ్రాముల బరువు ఉంది. 13.37 సెంటీమీటర్ల పొడవు ఉందని డాక్టర్లు తెలిపారు. దాదాపు కిలో బరువున్న రాయి కిడ్నీలో పెరగటం అంటే మాటలు కాదు మరి.

శ్రీలంక రాజధాని కొలంబో నగరంలోని ఆర్మీ ఆస్పత్రిలో జూన్ 1న కానిస్టస్ కూంగే అనే 62 ఏళ్ల వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి మూత్రపిండాల నుంచి ఈ భారీ రాయిని బయటకు తీశారు. అతను మాజీ సైనికుడు. ఆర్మీ ఆస్పత్రి ఈ వారం ఈ వార్త గురించి వివరించటంతో ఈ విషయం బయటకు తెలిసింది. కిడ్నీలో ఇంత పెద్ద రాయి ఉండటం ఆశ్చర్యకరమని తెలిపారు.

2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న రాయిని కిడ్నీ నుంచి బయటకు తీయగా..2008లో పాకిస్థాన్‌లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. ఈక్రమంలో తాజాగా శ్రీలంకలో వ్యక్తి కిడ్నీల నుంచి తొలగించిన ఈ రాయి బరువులోను, పొడవులోనూ ఆ రెండింటి రికార్డును బద్దలుగొట్టి ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌గా సరికొత్త రికార్డులు సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో అధికారికంగా గుర్తింపు పొందింది.