న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్త సంవత్సర సంబురాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు పట్టించుకోని మందుబాబులు వాహనాలు నడుపుతూ అడ్డంగా బుక్కాయ్యారు. తెలంగాణలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.
పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 3148 కేసులు నమోదు చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వారిపై 1030 కేసులు నమోదు అయ్యాయి. న్యూఇయర్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మందుబాబులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మంగళవారం (డిసెంబర్ 31, 2019) ఒక్కరోజే న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 3148 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన కమిషనరేట్లు, ముఖ్య కూడళ్లలో పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 951, రాచకొండ పరిధిలో 281, సైబరాబాద్ పరిధిలో 873 కేసులు నమోదైనట్లు తెలిపారు. నల్గొండలో 141, కరీంనగర్ లో 148, వరంగల్ లో 116, సిద్ధిపేటలో 99 కేసులు నమోదు చేశారు.
కాగా యుక్తవయస్సు ఉన్న వారిపైనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. వీరితో పాటు 60 సంవత్సరాల వయస్సు గల వారు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటం పోలీసులకు ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడ్డ వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెడతారు.
పట్టుబడ్డవారిపై గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నట్లైతే లైసెన్స్ ను రద్దు చేయనున్నారు. వారందరినీ జైలుకు పంపించాలనే వాదనను పోలీసులు కోర్టులో వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన న్యూయిర్ వేడుకల్లో పోలీసులు మందుబాబుల కిక్కు దింపనున్నారు.