లక్నోలో భారీ అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

  • Publish Date - February 13, 2019 / 10:09 AM IST

ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఉత్తరప్రదేశ్ : లక్నోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లాల్ బాగ్ ఏరియాలోని ఫర్నీచర్ గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లతో నీటిని ఎగిసిపడుతున్న మంటలపై చల్లుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు.