Hooligan Nabbed: యువతిని వెంటాడి వేధించిన పోకిరిని పట్టుకున్న పోలీసులు

యువతుల అమాయకత్వాన్ని అలసత్వంగా తీసుకుని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా ఆడవారి పట్ల ఇటువంటి దారుణాలు జరగడం శోచనీయం.

Hooligan Nabbed: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా పోకిరీల్లో మార్పు రావడంలేదు. ప్రజలు చూస్తుండగానే యువతుల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. యువతుల అమాయకత్వాన్ని అలసత్వంగా తీసుకుని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా ఆడవారి పట్ల ఇటువంటి దారుణాలు జరగడం శోచనీయం. బైక్ పై యువతిని వెంటాడి వేధించిన పోకిరిని పోలీసులు పట్టుకున్న ఘటన శనివారం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన వెకిలి చేష్టలతో బైక్ పై సుల్తాన్ నగర్ నుంచి రాజీవ్ నగర్ వరకు యువతిని వెంబడించిన ఆకతాయి..రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యువతిని అటకాయించాడు.

Also Read:RTC Charges Hike : ఆర్టీసీ గట్టెక్కాలంటే.. చార్జీల పెంపు తప్పనిసరి-బాజిరెడ్డి

అనంతరం యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆకతాయి చేష్టలతో భయబ్రాంతులకు గురైన బాధితురాలు..సహాయం కోసం బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. డయల్ 100కు ఫోన్ చేసి పోకిరిని పోలీసులకు అప్పగించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆకతాయిని స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ నిందితుడు, మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ వద్ద పీ.ఏగా పనిచేసినట్లు తెలుస్తుంది. బాధితురాలు ఓ పోలీసు అధికారి ఇంటిలో పనిచేస్తున్నట్లు సమాచారం.

Also read:Hyderabad : హైదరాబాద్ లో ఐసిస్ కలకలం…సానుభూతి పరుడు అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు