RTC Charges Hike : ఆర్టీసీ గట్టెక్కాలంటే.. చార్జీల పెంపు తప్పనిసరి-బాజిరెడ్డి

ఆర్టీసీ మరింతగా గట్టెక్కాలంటే బస్సు చార్జీల పెంపు తప్పనిసరి అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. చార్జీల పెంపుపై మరోసారి ముఖ్యమంత్రి..(RTC Charges Hike)

RTC Charges Hike : ఆర్టీసీ గట్టెక్కాలంటే.. చార్జీల పెంపు తప్పనిసరి-బాజిరెడ్డి

Rtc Charges Hike

RTC Charges Hike : ఆర్టీసీ మరింతగా గట్టెక్కాలంటే బస్సు చార్జీల పెంపు తప్పనిసరి అని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. చార్జీల పెంపుపై మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతామన్నారాయన. కాగా, గతంతో పోల్చుకుంటే టీఎస్ ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. బస్ స్టేషన్లలో వికలాంగులు, వృద్ధ ప్రయాణికుల కోసం బగ్గి ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని బస్ స్టేషన్లలో ఈ తరహా వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రానున్న రోజుల్లో కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నాం అన్నారు. సంస్థ మరింత లాభాల బాటలో పయనించే లక్ష్యంతోనే ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం కల్పించామని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఎవరినీ కావాలని సంస్థ నుంచి పంపించేందుకు ఒత్తిడి చేయడం లేదని, వీఆర్ఎస్ తీసుకోమని  చెప్పడం లేదన్నారు. ఒకే పద్ధతిలో కొనసాగుతున్న సంస్థలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.(RTC Charges Hike)

TSRTC Offer : తెలంగాణ ఆర్టీసీ ఉగాది కానుక..బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం

చార్జీల పెంపుపై ఇటీవలే బాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌండప్‌, సెస్‌ల పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ తాజాగా విధించిన చార్జీల పెంపు భారం కేవలం కొసరు మాత్రమేనని, త్వరలోనే అసలు వడ్డింపులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పెంపు సంస్థ తీసుకున్న నిర్ణయమని, ఈ పెంపుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సంస్థ బతికి బట్టకట్టాలంటే చార్జీలు పెంచాల్సిందేనని, త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయనుందని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం పెరిగిన చార్జీలు ప్రభుత్వం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారాయన. సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఈ పెంపు అనివార్యమైందన్నారు. టోల్‌గేట్లకు చెల్లింపుల ద్వారా సంస్థ ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు నష్టపోతుందన్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు టోల్‌గేట్లు ఉన్న మార్గాలలో టోల్‌ చార్జీలను పెంచామన్నారు. ప్రయాణికులపై ఇన్ని రకాల చార్జీలను పెంచినప్పటికీ సంస్థ రోజుకు రూ.6 కోట్ల వరకు నష్టాలను చవిచూస్తోందన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే కొద్ది మేర చార్జీలను పెంచడం అనివార్యమన్నారు. సంస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.

Yadadri Mini Buses : ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. వీఆర్‌ఎస్‌పై ఉద్యోగులెవరినీ బలవంతం చేయడం లేదని, ఇష్టం ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. వీఆర్‌ఎస్‌ కోసం ఇప్పటివరకు దాదాపు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారన్న విషయంపై స్పష్టత వచ్చాక ఎంత మేర చెల్లించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వీఆర్‌ఎస్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చిన అనంతరం ఖాళీలు ఎన్ని అన్న విషయంపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతామన్నారు.

Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్