ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు
- murthy
- Published On : February 12, 2021 / 03:57 PM IST
Husband opposes wife”s illegal affair, strangled to death by partner”s paramour in Uttarpradesh : ఉత్తర ప్రదేశ్ లోని షహరాన్ పూర్ లో వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఉదంతం వెలుగు చూసింది. షహరాన్ పూర్ జిల్లా కుతుబ్ షర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హౌజ్ ఖేరి ప్రాంతంలో నివసించే రిషిపాల్(32) 10 ఏళ్ల క్రితం పూనం అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. చక్కగా సాగుతున్న కాపురంలో ఇటీవలి కాలంలో కలతలు మొదలయ్యాయి.
పూనమ్ తమ ఇంటి సమీపంలోని అంకుర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈవిషయం రిషిపాల్ కు తెలిసింది. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అంకుర్ తో అక్రమ సంబంధం మానుకోమని హెచ్చరించాడు. ఈ విషయం అంకుర్ కు చెప్పింది పూనమ్. రిషీపాల్ హెచ్చరించినా వారిద్దరూ కలుసుకోవటం మాత్రం మానలేదు, తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది పూనమ్.
భర్తను తుద ముట్టించాలని ప్రియుడితో కల్సి ప్లాన్ వేసింది. ఒక రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు అంకుర్ ను ఇంటికి పిలించింది. ఇద్దరూ కలిసి గాఢనిద్రలో ఉన్న రిషిపాల్ ను గొంతుకోసి చంపారు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని దూరంగా పారేయటానికి ప్రయత్నించారు. ఈ లోగా రిషిపాల్ సోదరుడు మృతదేహాన్ని తీసుకువెళ్లటం చూసి వారిని ప్రశ్నించే సరికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయారు.
వెంటనే అతను పోలీసులకు సమచారం ఇచ్చాడు. ఘటనాస్దలానికి వచ్చిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, పూనమ్ అంకుర్ లను అదుపులోకితీసుకున్నారు. రిషిపాల్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
