Puppalaguda Girl Case Representative Image (Image Credit To Original Source)
Puppalaguda Girl Case: హైదరాబాద్ పుప్పాలగూడ బాలిక మిస్సింగ్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 ఏళ్ల బాలిక అదృశ్యం కేసును 24 గంటల్లోనే చేధించారు పోలీసులు. ఫిబ్రవరి 16న స్కూల్‌కి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. చంగిచెర్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో బాలికను ట్రేస్ చేశారు పోలీసులు. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం బాలికను గుర్తించి రక్షించారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఫిబ్రవరి 7న షాపింగ్‌కి వెళ్లిన సమయంలో బాలికకు తలాబ్‌కట్టకు చెందిన 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్ ద్వారా మాట్లాడుకునే వారు. ఇద్దరూ సన్నిహితంగా మారారు. ఫిబ్రవరి 16వ తేదీన మదీనా ప్రాంతంలో బాలిక బాలుడిని కలిసింది. ఇదే అదనుగా బాలుడు రెచ్చిపోయాడు. బాలికకు మద్యం తాగించాడు. కత్తితో బెదిరించి దారుణానికి ఒడిగట్టాడు. బాలికను ముగ్గురు బాలురు ఆటోలో చంగిచెర్లకు తీసుకెళ్లారు. కత్తితో బెదిరించి బలవంతంగా మద్యం తాగించి శారీరక, లైంగిక దాడి చేశారు.
ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకడు పరారీలో ఉన్నాడు. ఇమ్రాన్‌తో పాటు ప్రధాన నిందితుడు మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ కు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అతడిపై 8 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ, దొంగతనం, శారీరక దాడి కేసుల్లో ఇప్పటికే జైలుకి వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది.