Maharashtra : 19 ఏళ్ల కుర్రాడి రాక్షసత్వం.. ప్రేమ పేరుతో 180 మంది బాలికల ట్రాప్.. అత్యాచారం చేసి ఆపై వీడియోలు

Maharashtra Teen Abuse Case : 19 ఏళ్ల కుర్రాడు.. సుమారు 180 మంది బాలికను ట్రాప్ చేసి లైంగికంగా వేధించి ఆపై వీడియోలు తీశాడు.

in Maharashtra Teen physically abused 180 minors and filmed 350 obscene videos

  • మహా రాష్ట్రంలో దారుణం
  • ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అత్యాచారం
  • వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్న 19 ఏళ్ల యువకుడు

Maharashtra teen abuse case : మహారాష్ట్రలో వెలుగు చూసిన ఓ దారుణ సంఘటన దేశాన్ని కుదిపేసింది. మనం ఎలాంటి రాక్షసుల మధ్య బతుకుతున్నామో బట్టబయలు చేసింది. పైకి మంచి వారిగా కనిపించే మనిషి లోపల ఎలాంటి వికృత ఆలోచనలు ఉంటాయో ఈ దారుణం చేస్తే తెలుస్తుంది. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఓ కుర్రాడు.. ప్రేమ పేరిట మైనర్ బాలికలను ట్రాప్ చేకసి.. వారికి మాయ మాటలు చెప్పి లోబర్చుకునేవాడు. ఆపై వారిని అశ్లీలంగా వీడియోలు తీసి.. వాటిని ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఇలా ఈ రాక్షసుడి చేతిలో బలైంది ఒక్కరు, ఇద్దరు కాదు. దాదాపు 180 మంది ఇతడు లైంగికంగా వేధించాడని.. వారికి 350కిపైగా వీడియోలు తీశాడని వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అయాన్ అహ్మద్ తన్వీర్‌ అనే 19 ఏళ్ల కుర్రాడు ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. తన్వీర్ సుమారు 180 మంది బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చినప్పటికీ.. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేవలం 8 మంది బాధితులనే గుర్తించారు.

తన్వీర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మొబైల్ ఫోన్‌లో పలు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అయాన్ మైనర్ బాలికలను టార్గెట్ చేసి వారితో స్నేహం చేసేవాడని, ఆపై ప్రేమ పేరిట ట్రాప్ చేసేవాడని పోలీసు విచారణలో తేలింది. బాలికలను లైగికంగా దగ్గరయ్యి ఆ వీడియోలు తీసి వారిని వేధించేవాడని వెల్లడయ్యింది. ఈ కేసులో పోలీసులు ఉజర్ ఖాన్ అనే మరో యువకుడిని కూడా అరెస్టు చేశారు. ఇతడు తన్వీర్ రికార్డ్ చేసిన అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.

రాజకీయ దుమారం..

అయితే ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. అందుకు కారణం నిందితుడు తన్వీర్‌కు.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (ఎంఐఎం) పార్టీతో సంబంధం ఉందన్న ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. తన్వీర్‌కు ఎంఐఎంతో సంబంధాలున్నాయని, స్థానిక ఎన్నికల సమయంలో అతను పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

తన్వీర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పరత్వాడ, అచల్‌పూర్ ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఇదిలా ఉంటే.. నిందితుడు తన్వీర్ ఇంటిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతని ఇంటితోపాటు సమీపంలోని అక్రమ కట్టడాలను సైతం స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అయితే నిందితుడు తన్వీర్ ఇల్లు అక్రమ నివాసమని.. దీనిపై గతంలోనే నోటీసులు ఇచ్చామని తెలిపారు.