Narasaraopet Theft Case : ‘నన్ను క్షమించండి’.. రూ.19లక్షలు రిటర్న్ ఇచ్చిన దొంగ.. నరసరావుపేటలో షాకింగ్ ట్విస్ట్.. అంజనం ఎఫెక్టేనా?
Narasaraopet Theft Case : ఏపీలోని నరసరావుపే పట్టణంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అంజనంతో హడలిపోయిన దొంగ కొట్టేసిన డబ్బులో అధికమొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు.
Narasaraopet Theft Case
Narasaraopet Theft Case : ఏపీలోని నరసరావుపే పట్టణంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అంజనంతో హడలిపోయిన దొంగ కొట్టేసిన డబ్బులో అధికమొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు.. డబ్బు వదిలిన ప్రాంతంలో ఓ లెటర్ కూడా వదిలివెళ్లాడు. ఆ లెటర్ చూసిన పోలీసులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో చర్చ నీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనకు సంబంధించిన వార్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ దొంగ డబ్బు ఎందుకు తిరిగి ఇచ్చాడు? దీని వెనుక ‘అంజనం’ కథ ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : Andhra Pradesh : ఏపీలో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
ఏపీలోని నరసరావుపేట పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో జూలై 30వ తేదీన దొంగతనం జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు 317 గ్రాముల బంగారం, రూ.21 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, దాదాపు 15రోజులు గడిచినా నిందితుల ఆచూకీ లభించలేదు.
పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంటి యజామాని ఉదయం నిద్రలేచి బయటకు రాగా.. చెప్పుల స్టాండ్ వద్ద ఓ కవర్ కనిపించింది. తొలుత భయాందోళనకు గురైన యజమాని.. ఆ తరువాత ధైర్యం చేసి కవర్ ను ఓపెన్ చేసి చూసి ఆశ్చర్య పోయాడు కవర్ లో రూ.19లక్షలు నగదు ఉండటంతో .. ఆ డబ్బు తమ ఇంట్లో చోరీకి గురైన నగదులో భాగమేనని గుర్తించి.. వెంటనే జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కవర్ ను పరిశీలించగా.. అందులో లెటర్ కనిపించింది.
లెటర్ ను తెరిచి చూడగా అందులో ‘నన్ను క్షమించండి.. నా వాటాగా వచ్చిన రూ.19లక్షలను తిరిగి ఇస్తున్నాను’’ అని రాసిఉంది. పోలీసులు లెటర్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇదిలా ఉంటే.. దొంగ డబ్బులు తిరిగి ఇవ్వటానికి కారణం అంజనం అంటూ స్థానికులు చర్చించుకోవటం గమనార్హం.
ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత.. ఆ ఇంటి యజమాని మంత్రగాడిని కలిశారు. ఆ మంత్రగాడు ఈ దొంగతనం చేసింది మీ అపార్ట్ మెంట్లో ఉండే కొంత మంది కావొచ్చు అని చెప్పాడు. దీని కోసం ఆ మంత్రగాడు అంజనం వేసినట్లు అపార్ట్మెంట్లో చెప్పారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసింది. దొంగతనంపై అంజనం చేయించారంటా ప్రచారం జరిగింది. ఈ విషయం దొంగ వరకు చేరినట్లు ఉంది.. భయంతో కొట్టేసిన డబ్బును.. అర్థరాత్రి ఎవరూ చూడకుండా.. ఇంటి గుమ్మం దగ్గర వదిలి వెళ్లాడు.. ఈ విషయం ఇప్పుడు నరసరావుపేటలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే, పోలీసులుమాత్రం దొంగ ఎవరో గుర్తించేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
