Nagpur: ప్రాణం తీసిన వయాగ్రా.. రెండు మాత్రలు వేసుకుని వ్యక్తి మృతి
నాగ్‌పూర్‌లో ఇటీవల 41 ఏళ్ల ఒక వ్యక్తికి, హోటల్‌లో మహిళ పరిచయమైంది. దీంతో ఆమెతో గడిపేందుకు అతడు రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆల్కహాల్‌తో కలిపి మాత్రలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు మొదలయ్యాయి.
- Narender Thiru
- Published On : March 7, 2023 / 05:15 PM IST
Nagpur: మగవారిలో శృంగార సామర్ధ్యాన్ని పెంచేందుకు వాడే వయాగ్రా ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. అయితే, ఇది చాలా అరుదైన విషయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక జర్నల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌లో ఇటీవల 41 ఏళ్ల ఒక వ్యక్తికి, హోటల్‌లో మహిళ పరిచయమైంది.
Plane Crash In US: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, ఆమె కూతురుకు గాయాలు
దీంతో ఆమెతో గడిపేందుకు అతడు రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆల్కహాల్‌తో కలిపి మాత్రలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు మొదలయ్యాయి. దీంతో ఆ మహిళ అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, తనకేమీ కాలేదని, అలా అవ్వడం మామూలేనని అతడు ఆ మహిళకు చెప్పాడు. దీంతో ఆమె కూడా అతడిని కొంతసేపు పట్టించుకోలేదు. కానీ, తర్వాత అతడి పరిస్థితి విషమించింది. వెంటనే స్పందించిన మహిళ.. హోటల్ సిబ్బంది సహకారంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిజానికి అతడికి అంతకుముందు ఎలాంటి పెద్ద అనారోగ్యం లేదు.
Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ
కానీ, ఈ పరిస్థితుల్లో అతడు మరణించేందుకు సెరిబ్రో వాస్క్యులర్ హెమరేజ్ కారణం అని వైద్యులు తేల్చారు. అంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతోపాటు రక్తం గడ్డకట్టడం, హైబీపీ, ఆల్కహాల్, మందులు కలిపి తీసుకోవడం వంటివి అతడి మరణానికి కారణాలని వైద్యులు ధృవీకరించారు. వయాగ్రా లాంటి మాత్రలు తీసుకునే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌తో కలిపి మందులు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
