Plane Crash In US: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, ఆమె కూతురుకు గాయాలు

ఈస్ట్ ఫార్మింగ్‌డేల్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 02.18 నిమిషాలకు ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇది చిన్న, సింగిల్ ఇంజిన్ విమానం. ఈ విమానంలో ఫైజుల్ చౌదురి అనే పైలట్, రోమా గుప్తా (63) అనే మహిళ, ఆమె కూతురు రీవా గుప్తా ఉన్నారు.

Plane Crash In US: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, ఆమె కూతురుకు గాయాలు

Plane Crash In US: అమెరికాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమె కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈస్ట్ ఫార్మింగ్‌డేల్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 02.18 నిమిషాలకు ప్రత్యేక విమానం బయలుదేరింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు

ఇది చిన్న, సింగిల్ ఇంజిన్ విమానం. ఈ విమానంలో ఫైజుల్ చౌదురి అనే పైలట్, రోమా గుప్తా (63) అనే మహిళ, ఆమె కూతురు రీవా గుప్తా ఉన్నారు. విమానం దక్షిణ సముద్ర తీరం మీదుగా, నార్త్ లిండెన్‌హర్ట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా విమానం క్యాబిన్‌లో పొగలు రావడాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ఎయిర్‌పోర్టు అధికారులను అనుమతి కోరాడు. వారి అనుమతితో విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ సమయంలో విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో రోమా గుప్తా మరణించింది.

ఆమె కూతురు, పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని విమాన సంస్థకు చెందిన ప్రతినిధులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.