Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టులపర్వం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్టు అయ్యారు. ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు

ARREST

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టులపర్వం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు అయ్యారు. ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవకతవకలపై ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించారు. అయితే రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారుల ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ వ్యవహారాలు నడిపిన కీలక వ్యక్తి అరుణ్ రామచంద్ర పిళ్లై.

అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యాపారవేత్త, లిక్కర్ వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. ఢిల్లీలోని ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా దారుడుగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్లై ఒకరని చెప్పవచ్చు. అతన్ని రెండు రోజులపాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత (సోమవారం) రాత్రి 11 గంటల సమయంలో ఈడీ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరనున్నారు.

Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ, సీబీఐ అధికారులు లిక్కర్ స్కామ్ కు సంబంధించి అనేక అంశాలపై ప్రశ్నించారు. ఆయన అప్రూవర్ గా మారినట్లుగా తెలుస్తోంది. సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జీ షీట్ లో కూడా ఆయన పేరుంది. ఆయన ముందుస్తు బెయిల్ తీసుకున్నారు. సీబీఐ కేసులో ఉన్న చార్జీ షీట్ కు సంబంధించిన తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు.

కానీ ఈడీ మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా వంద కోట్ల రూపాయల ముడుపులు విజయ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్టు చేశారు. గత నెల (ఫిబ్రవరి) 16న కూడా ఢిల్లీలో అరుణ్ రామచంద్ర పిళ్లైని ప్రశ్నించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, బుచ్చిబాబు తర్వాత అరుణ్ రామచంద్ర పిళ్లైని ప్రశ్నించారు. ప్రధానంగా ఢిల్లీలో సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాలు నడిపిన కీలక వ్యక్తులు అభిషేక్ బోయిన్ పల్లి, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా సమీర్ మహీంద్రకు గోరంట్ల బుచ్చిబాబు పరిచయం అయ్యారు. అలాగే అరుణ్ రామచంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీలోని అపార్ట్ మెంట్ లో సమీర్ మహీంద్రను కలిసి విజయ నాయర్ ను కలిసి లిక్కర్ పాలసీ ఏ విధంగా వ్యాపారులకు అనుకూలంగా ఉండబోతుంది? ఎంత మేర లాభాలు రాబోతున్నాయి? వీటన్నింటికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

కిక్ బాక్స్ కు ఎంత ఇవ్వాలి? ఎన్ని కోట్ల రూపాయలు కావాలనుకుంటున్నారు? వీటన్నింటికీ సంబంధించిన అంశాలను ఢిల్లీలో ఉండి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు నడిపారు. తొలుత అభిషేక్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు. ఆయను సీబీఐ కేసులో బెయిల్ వచ్చింది. కానీ అరుణ్ రామచంద్ర పిళ్లైని సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు. ఇటు మాగుంట్ల రాఘవ, గోరంట్ల బుచ్చిబాబుతోపాటు మనిశ్ సిసోడియా కూడా అరెస్టు అయ్యారు.