Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Delhi Liquor Scam

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించారు. మల్హోత్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

ఈడీ అధికారుల వాదనను ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు గౌతమ్ మల్హోత్రాకు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణ మార్చి1కి వాయిదా వేసింది. దీంతో గౌతమ్ మల్హోత్రాను పోలీసులు పీఆర్ జేకు తరలించారు. ఈ నెల 8న గౌతమ్ మల్హోత్రాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్ .. తెరపైకి సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ గొరకవి

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ డ్రా కేసు దర్యాప్తును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. గౌతమ్ మల్హోత్రా ఢిల్లీలో గౌతమ్ వైన్స్, గౌరవ్ వైన్స్ పేరుతో ముఖ్యంగా ఎల్1, ఎల్7 తో లైసెన్స్ లను సంపాదించి ఈ లిక్కర్ పాలసీలో ఆయన కూడా ముఖ్య భాగస్వామిగా కొంత ముడుపులు చెల్లించారు.