ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

  • Publish Date - May 12, 2019 / 01:52 PM IST

ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.

మరోవైపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం దగ్గర కేటుగాళ్లు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. స్టేడియం చుట్టూ నెంబర్ ప్లేట్ లేని బైక్ పై తిరుగుతూ బ్లాక్ టికెట్ లు అమ్మారు. వెయ్యి టికెట్ ను రూ.5 వేలకు, రూ.2 వేల టికెట్ ను రూ.10 వేలకు విక్రయించారు. స్టేడియం దగ్గర భారీ భద్రతా ఏర్పాటు చేశారు.

ఉప్పల్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ ప్రారంభం అయింది. డిఫెండింగ్ చాంపియన్‌లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆఖరి పోరు మొదలైంది. ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న జట్లు నాల్గవసారి ట్రోఫీని దక్కించుకునేందుకు పోరాడుతున్నాయి.