ప్రముఖ టీవీ నటుడు కరణ్ అరెస్ట్

ముంబైలోని ఓషివారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ రేప్ కేసు పెట్టింది. అరెస్ట్ వార్త బయటకు రాగానే అలర్ట్ అయ్యారు పోలీసులు.

  • Publish Date - May 6, 2019 / 07:55 AM IST

ముంబైలోని ఓషివారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ రేప్ కేసు పెట్టింది. అరెస్ట్ వార్త బయటకు రాగానే అలర్ట్ అయ్యారు పోలీసులు.

ప్రముఖ హిందీ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ ను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. 2019, మే 6వ తేదీన అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఓ మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కేసు నమోదు అయ్యింది. ఆమె ఎవరు అనేది మాత్రం గోప్యంగా ఉంచుకున్నారు. టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయే అనే టాక్ వినిపిస్తోంది. 2017 ముంబైలోని ఓషివారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ రేప్ కేసు పెట్టింది. అరెస్ట్ వార్త బయటకు రాగానే అలర్ట్ అయ్యారు పోలీసులు. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. 
హిందీలో మహేష్ భట్ నిర్మించిన స్వాభిమాన్ సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు కరణ్. ఆ సీరియల్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సాయ, జెస్సీ జైసీ కియో నహీ సీరియల్స్ లో కూడా లీడ్ రోల్ చేశాడు. ఇటీవలే అమేజాన్ ప్రైమ్ లో వచ్చిన ఓ వెబ్ సిరీస్ లోనూ నటించాడు.