×
Ad

HM Misbehaved With Girl Students : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్‌ మాస్టర్‌..చితక్కొట్టిన గ్రామస్తులు

కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామారావు... ఎనిమిది- తొమ్మిదో తరగతి విద్యార్థినులను కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల వైరాలో గాంధీజీ చిత్ర ప్రదర్శనకు విద్యార్థులను తీసుకువచ్చి సినిమాహాలులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కామంతో రెచ్చిపోయిన గురువుకు స్థానికులు దేహశుద్ధి చేశారు.

  • Published On : August 22, 2022 / 04:01 PM IST

HM misbehaved with girl students

HM Misbehaved With Girl Students : మరో కీచక టీచర్‌ బాగోతం పయటపడింది. విద్యార్థినులతో హెడ్‌ మాస్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కామంతో రెచ్చిపోయిన గురువుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో హెచ్‌ఎం రామారావును విద్యార్థినుల తల్లిదండ్రులు చితకొట్టారు. కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామారావు… ఎనిమిది- తొమ్మిదో తరగతి విద్యార్థినులను కొంత కాలంగా వేధిస్తున్నాడు.

ఇటీవల వైరాలో గాంధీజీ చిత్ర ప్రదర్శనకు విద్యార్థులను తీసుకువచ్చి సినిమాహాలులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాఠశాలలో సైతం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు విషయం తెలిపారు. హెచ్ఎం రామారావు ఆగడాలపై విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయినా అతడి ప్రవర్తన మారకపోవడంతో పాఠశాలకు వచ్చే సమయంలో హెచ్‌ఎంను స్థానికులు అడ్డుకొని దాడి చేశారు.

Judge Raped Minor Boy : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన జడ్జి- పోక్సో కేసు నమోదు

ఈ విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హెచ్‌ఎంను పోలీసులు తీసుకువెళ్తుండగా మరోసారి స్థానికులు అడ్డుకున్నారు. హెచ్‌ఎంను కారులో ఎక్కిస్తుండగా అతడ్ని లాగి దాడి చేశారు. దీంతో పోలీసులు స్థానికులను చెదరగొట్టి హెచ్‌ఎం రామారావును తీసుకెళ్లారు.