Judge Raped Minor Boy : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన జడ్జి- పోక్సో కేసు నమోదు

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక న్యాయమూర్తి 14 ఏళ్ళ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయటానికి వెళితే ఆమెను పోలీసులు బెది

Judge Raped Minor Boy : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన జడ్జి- పోక్సో కేసు నమోదు

Judge Raped By Minor Boy

Judge Raped Minor Boy : రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక న్యాయమూర్తి 14 ఏళ్ళ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది.  న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయటానికి వెళితే బాధితుడి తల్లినను పోలీసులు బెదిరించినట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని భరత్ పూర్ లో 14 ఏళ్ల బాలుడు ఆటలాడుకునేందుకు రోజూ భరత్ పూర్ లోని గ్రౌండ్‌కు వెళ్లేవాడు. అక్కడకు  ఏసీబీ కేసులు విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి జితేంద్ర గొలియా తన సహాయకులిద్దరితో వస్తూ ఉండేవారు.  అక్కడ వారు  ఆబాలుడిని పిలిచి అతనితో అసభ్యంగా ప్రవర్తించేవారు. ఆ బాలుడిని ఇంటికి తీసుకువెళ్లి మద్యం, మత్తు పదార్ధాలు ఇచ్చేవారు.

స్పృహ కోల్పోయాక బాలుడిపై లైంగిక చేష్టలు చేసేవారు. బాలుడిపై నెల రోజులకు పైగా లైంగిక దాడి జరిగాక  బాలుడు తన తల్లికి చెప్పాడు.  వితంతువైన ఆ తల్లి మథుర గేట్ హౌస్  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళ్ళింది. అక్కడ పోలీసులు వారిని బెదిరించారు. పోలీసు స్టేషన్ లో తనకు జరగిన అనుభవాన్ని వివరిస్తూ ఆ తల్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి న్యాయం జరిపించమని లేఖ రాసింది.

అక్కడ స్టేషన్ ఇన్‌ఛార్జి రామ్ నాథ్ గుర్జార్ ఆమెను కేసు పెట్టవద్దని బెదిరించాడు. బాలుడ్ని బెదిరించి తీవ్రంగా   ప్రశ్నించారని ఆమె తన లేఖలో వివరించింది. కేసులో రాజీకి రాకపోతే ఆమెపైనా, కుటుంబ సభ్యులపైనా నకిలీ కేసులు పెడతామని బెదిరించారు. కేసులో రాజీకి రావాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె తెలిపింది.

ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వెళ్లగా స్టేషన్ ఇన్ ఛార్జి కేసు తీసుకోకుండా ఆమెను, కుటుంబ  సభ్యులను చాలా సేపు పోలీసు స్టేషన్ లోనే కూర్చోపెట్టారని వాపోయింది. బాలుడిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఎవరికైనా చెపితే తుపాకీతో కాల్చి చంపుతానని జడ్జి తనను బెదిరించినట్లు వితంతు మహిళ ప్రధానికి రాసిన లేఖలో వివరించింది.  ఈకేసులో రాజస్థాన్ పోలీసుల తీరుపై పలు అనుమానాలున్నాయని అందుకే నేను రాజస్థాన్ వదిలి దూరంగా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతానని ఆమె తెలిపింది.
Also Read : Drunken Headmaster : మందుకొట్టి విద్యార్ధినులతో డ్యాన్స్ చేయించిన హెడ్‌మాస్టర్
ఇప్పటికే కేసును ఉపసంహరించుకోమని మానసికంగా వేధిస్తున్నారని దయచేసి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకుంటున్నానని ఆమె పేర్కోంది. వారి ఒత్తిడి పెరిగితే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆ మహిళ తన లేఖలో తెలిపింది. కాగా చివరికి పోలీసులు జడ్జిమీద పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. జడ్డిపై విచారణకు అధికారిని నియమించినట్లు మధుర గేట్ పోలీసుస్టేషన్ ఎస్సై రామ్ నాథ్ చెప్పారు.