Drunken Headmaster : మందుకొట్టి విద్యార్ధినులతో డ్యాన్స్ చేయించిన హెడ్‌మాస్టర్
ఆడపిల్లలను గౌరవంగా చూస్తూ, విద్యాబుధ్దులు నేర్పించాల్సిన స్కూల్ హెడ్‌మాస్టర్ మద్యం సేవించి తనతో కలిసి డ్యాన్స్ చేయమని బలవంతం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Drunken Head Master
Drunken Headmaster : ఆడపిల్లలను గౌరవంగా చూస్తూ, విద్యాబుధ్దులు నేర్పించాల్సిన స్కూల్ హెడ్‌మాస్టర్ మద్యం సేవించి తనతో కలిసి డ్యాన్స్ చేయమని బలవంతం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని మధియాడో గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్ ముండా శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలోనే మద్యం సేవించాడు. అనంతరం కొంత మంది విద్యార్ధినులను తన గదిలోకి పిలిపించుకున్నాడు.
Also Read : Telangana : అల్పపీడనం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు
తన గది తలుపు బోల్టు బిగించాడు. వారందరినీ తనతో కలిసి డ్యాన్స్ చేయమని బలవతం చేశాడు. వారు అతను చెప్పినట్లు చేశారు. ఆ నృత్యాలను రాజేష్ ముండా వీడియో తీశాడు. విద్యార్ధినులు ఇళ్లకు తిరిగి వెళ్లిన తర్వాత ఈవిషయాన్నితమ తల్లితండ్రులకు చెప్పారు. వారు వెంటనే ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
జిల్లాకలెక్ట్ర్ ఎస్. కృష్ణ చైతన్య ఈఘటనపై వెంటనే విచారణకు ఆదేశించారు. బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారితో విచారణ చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.కె.మిశ్రా తెలిపారు. శనివారం నివేదిక రాగానే జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని విధులనుంచి సస్పెండ్ చేశారు.