మహాతల్లి : భర్తను చంపి..ఇంట్లోనే పూడ్చేసి..పైన పొయ్యి పెట్టింది

  • Publish Date - November 22, 2019 / 08:50 AM IST

ఆడవారంటే అమ్మతనం. కానీ ఇప్పుడా అమ్మతనం హత్యలు చేస్తున్న ఘటనల గురించి వింటున్నాం. ఇది చాలా బాధాకరం. సందర్భాలు..కారణాలు ఏమైనా కొంతమంది మహిళలు చేస్తున్న అకృత్యాలు వింటుంటే మానవత్వం మంటగలిసిపోతున్న ఆందోళన కలుగుతోంది. ఇటువంటి దారుణానికి పాల్పడింది ఓ భార్య. భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టేసింది. ఏమీ తెలియనట్లుగా భర్త కనిపించటంలేదంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కానీ నిజం నిప్పులాంటిదంటారు. అందుకే దాగలేదు..భర్తను చంపి వంట ఇంట్లో పూడ్చి పెట్టిన భార్య ఉదంతం మధ్యప్రదేశ్ లోని అనుపూర్ జిల్లాలో నెల రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే..అనుపూర్ జిల్లాలోని కరోండి గ్రామంలో మహేష్ బనావాల్ (35) అడ్వకేట్ గా పనిచేస్తుంటాడు. అతని భార్య పేరు ప్రమీల. కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ప్రమీల భర్త మహేష్ ను అక్టోబర్ 22న హత్య చేసింది. తరువాత వంటి ఇంటిలో పూడ్చి పెట్టేసింది. దాన్ని కాంక్రీట్ తో మూయించేసింది. దానిపై పొయ్యి పెట్టి వంట చేయటం చేస్తోంది. తరువాత  ఏమీ తెలియనట్లు..తన భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు  చేసింది.   

మహేశ్ కోసం అతని తరపు బంధువులు ఇంటికి వస్తే అనుమానం రాకుండా..నా భర్త కనిపించకుండా పోయాడనీ ఎవ్వరూ పట్టించుకోవటంలేదంటూ మొసలి కన్నీరు కారుస్తూ వారిని తిట్టేది. మీ వల్లే నా భర్త..కనిపించకుండాపోయాడంటూ తిడుతూ..నా ఇంటికి ఎవ్వరూ రావద్దు అంటూ వారిని ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడేది. 

కానీ..రెండు రోజుల క్రితం ప్రమీల ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం..అదేమంని అడిగితే పొంతలేని సమాధానాలుచెబుతున్న ప్రమీల ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో..ప్రమీల ఇంట్లో నవంబర్  21 పోలీసులు తనిఖీలు చేశారు. కిచెన్‌లోంచి వాసన ఎక్కువగా రావటంతో అక్కడ తవ్వించారు. దీంతో మహేశ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమీలను అదుపులోకి తీసుకుని..శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. 

కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా..మహేశ్ సోదరుడు గంగరాం భన్వాల్ భార్యతో మహేశ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో గంగరాం..ప్రమీల సహాయంతో ఇద్దరూ కలిసి మహేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ..మహేశ్ హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని గంగరాం అంటుండటంతో మహేశ్ ను హత్య చేసేందుకు  ప్రమీలకు ఎవరూ సహకరించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ కు ప్రమీలకు నలుగురు కుమార్తెలు ఉన్నారు.