Maharashtra : సగం గడ్డం గీశాక డబ్బులు కోసం గొడవ .. గొంతు కోసి చంపిన క్షురకుడు .. అతడిని కొట్టి చంపిన బంధువులు

క్షురకుడు సగం గడ్డం గీశాక డబ్బులు ఇమ్మన్నాడు క్షురకుడు. షేవింగ్ పూర్తి అయ్యాక ఇస్తానన్నాడు కష్టమర్.కానీ ఇప్పుడే కావాలన్నాడు క్షురకుడు. ఆ గొడవతో క్షురకుడు గడ్డం గీయించుకునే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు సదరు క్షురకుడి కొట్టి చంపేశారు. అలా గడ్డం గీయించుకునే సమయంలో డబ్బుల కోసం వచ్చిన గొడవకాస్తా ఇద్దరి ప్రాణం తీసింది.

  • Published on- September 17, 2022 / 12:22 PM IST

Barber, customer tiff turns violent, both die in Nanded District

Maharashtra : ఎవరితోనైనా ఎప్పుడైనా గొడవ పెట్టుకోవచ్చేమోగానీ..క్షురకుడు గడ్డం గీసేసమయంలో అతనితో మాత్రం గొడవ పెట్టుకోవద్దని పెద్దలు చెప్పిన మాట. ఎందుకంటే మన గొంత క్షురడికి చేతిలో ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చిన కస్సుక్కున దింపేయొచ్చు క్షురకుడి చేతిలో ఉన్న షేవింగ్ చాకుతో. అచ్చం అదే జరిగింది మహారాష్ట్రలో. క్షురకుడు సగం గడ్డం గీశాక తలెత్తిన గొడవకాస్తా పెద్దదైంది. అంతే సదరు క్షురకుడు ఏమాత్రం ఆలోచించకుండా గడ్డం గీయించుకునే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు సదరు క్షురకుడితో ఘర్షణ పడ్డారు. మాటా మాటా పెరిగింది. అంతే వారంతా క్షురకుడిపై దాడి చేసి కొట్టి చంపేశారు. అలా గడ్డం గీయించుకునే సమయంలో డబ్బుల కోసం వచ్చిన గొడవకాస్తా ఇద్దరి ప్రాణం తీసింది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని బోధి గ్రామంలో గురువారం (సెప్టెంబర్ 15,2022) వెంకట్ సురేశ్ దేవ్‌కర్ అనే 22 ఏళ్ల యువకుడు షేవింగ్ కోసం అనిల్ మారుతి షిండే సెలూన్‌‌కు వచ్చాడు. సగం షేవింగ్ అయ్యాక వెంకట్‌ను అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తానని వెంకట్ చెప్పాడు. కానీ ఇప్పుడే ఇవ్వాలన్నాడు అనిల్. అదేంటీ గడ్డం పూర్తిగా గీశాకే ఇస్తాను అంటూ పట్టుపట్టాడు వెంకట్. కానీ డబ్బులు ఇచ్చాకే పూర్తిగా గీస్తాను లేదంటే చేయను అంటూ పట్టుపట్టుకుని కూర్చున్నాడు అనిల్. అలా డబ్బుల కోసం మాటా మాటా పెరిగింది.

అది మరింత ముదరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్షురకుడు అనిల్ దుకాణంలోని పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు గోశాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన అతడి బంధువులు సెలూన్ వద్దకు గంపుగా వచ్చి దానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత పరారీలో ఉన్న అనిల్‌ను వెతికి వెతికి పట్టుకుని కొట్టి కొట్టి చంపేశారు. అతడి ఇంటిని కూడా తగలబెట్టారు. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలా గడ్డం గీసేసమయంలో వచ్చిన చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. తీవ్ర ఉద్రిక్తలను దారి తీసింది.