Demands for Chocolates: చాక్లెట్లు అడిగిందని కన్నతండ్రి కుమార్తెను చంపాడు

Demands for Chocolates: కన్న కుమార్తె చాక్లెట్లు, బొమ్మలు ఇప్పించాలని డిమాండ్ చేసిందని తండ్రి ఆమెను రాళ్లతో కొట్టి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగింది. మాదకద్రవ్యాలకు బానిసగా మారడంతో మూడేళ్ల క్రితం భార్య భర్తను వదిలేసింది. భార్య ఇండోర్ నగరంలోని ఓ ఆలయం వద్ద బిక్షాటన చేస్తోంది.

Odisha train accident:48 గంటల తర్వాత శిథిలాల్లో వెలుగుచూసిన అసోం యువకుడు

తన వద్ద ఉన్న 8 ఏళ్ల కుమార్తె తరచూ చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు కావాలని పదేపదే డిమాండ్ చేస్తుందని కోపంతో కన్న తండ్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు తీసుకువెళ్లి టైల్స్, రాళ్లతో తలను చితకబాది హత్య చేశాడు.నిందితుడి నుంచి ఓటరు కార్డును స్వాధీనం చేసుకున్నామని ఇండోర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాజేష్ కుమార్ సింగ్ చెప్పారు.37 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశామని డీసీపీ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు